Asianet News TeluguAsianet News Telugu

నాగార్జునతో లిప్ లాక్ సీన్ కి ఓకె.. కండిషన్స్ అప్లై అంటున్న అమలాపాల్ ?

కింగ్ నాగార్జున నటిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ 'ఘోస్ట్'. ప్రతిభావంతుడైన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 'గరుడ వేగ' చిత్రంతో ప్రవీణ్ సత్తారు అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే.

interesting details about amalapaul and nagarjuna romance in ghost
Author
Hyderabad, First Published Oct 22, 2021, 3:37 PM IST

కింగ్ నాగార్జున నటిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ 'ఘోస్ట్'. ప్రతిభావంతుడైన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 'గరుడ వేగ' చిత్రంతో ప్రవీణ్ సత్తారు అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. దీనితో నాగ్, ప్రవీణ్ కాంబోపై ఆసక్తి నెలకొని ఉంది. 

ఆ మధ్యన విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో మొదట Nagarjuna కి హీరోయిన్ గా Kajal Aggarwal అనుకున్నారు. కాజల్ వారం రోజులు షూటింగ్ లో కూడా పాల్గొంది. కానీ వ్యక్తిగత కారణాల వల్ల కాజల్ 'ఘోస్ట్' మూవీ నుంచి తప్పుకుంది. దీనితో కాజల్ ప్లేస్ భర్తీ చేసేందుకు చాలా మంది హీరోయిన్లని పరిశీలించారు. చివరకు డస్కీ బ్యూటీ అమలాపాల్ ని ఫిక్సయ్యారు. 

AmalaPaul, నాగ్ జోడీపై ఆసక్తికర వార్త ఒకటి వైరల్ అవుతోంది. ఈ మూవీ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో నాగ్, అమల మధ్య ఘాటుగా రొమాంటిక్ ఎపిసోడ్స్ ఉన్నాయట. సాంగ్ లో వీరిద్దరూ రొమాన్స్ చేస్తారని వినికిడి. అందమైన హిల్ స్టేషన్ లో ప్రవీణ్ ఈ సన్నివేశాలని చిత్రికరించబోతున్నట్లు తెలుస్తోంది. రొమాంటిక్ సన్నివేశాల్లో నాగార్జునతో అమలాపాల్ లిప్ లాక్ సీన్ కూడా ఉండబోతున్నట్లు హాట్ న్యూస్. 

బోల్డ్ గా అందాలు ఆరబోసే అమలాపాల్ కు రొమాంటిక్ సీన్స్ లో నటించడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే లిప్ లాక్ సన్నివేశానికి మాత్రం కండిషన్ పెట్టిందట. ఆ సీన్ లో నటించాలంటే అదనపు రెమ్యునరేషన్ ఇవ్వాలని కండిషన్ పెట్టిందట. దీనితో మేకర్స్ కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కొనసాగి ఉంటే ఈ రొమాంటిక్ సన్నివేశాలని అంగీకరించేదా అంటే అనుమానమే. 

Also Read: ‘‘ మా ’’ ఎన్నికల్లో ట్విస్ట్‌ : బయటివాళ్లు ఓటర్లను కొట్టారు.. తెరపైకి వైసీపీ నేత పేరు, ప్రకాష్ రాజ్ సంచలనం

సో మన్మథుడు 2 తర్వాత నాగార్జున మరోసారి రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోనున్నారు. టాలీవుడ్ లో రొమాన్స్ అంటే అభిమానులకు ముందుగా గుర్తుకు వచ్చే హీరో నాగార్జునే. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక అమలాపాల్ ఇటీవల బోల్డ్ బ్యూటీగా గుర్తింపు పొందింది. 'ఆమె' చిత్రంలో అమలాపాల్ న్యూడ్ గా నటించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.

Follow Us:
Download App:
  • android
  • ios