Asianet News TeluguAsianet News Telugu

‘‘ మా ’’ ఎన్నికల్లో ట్విస్ట్‌ : బయటివాళ్లు ఓటర్లను కొట్టారు.. తెరపైకి వైసీపీ నేత పేరు, ప్రకాష్ రాజ్ సంచలనం

బయటివాళ్లు ఓటర్లను బెదిరించారని ఆయన మా ఎన్నికల అధికారికి  ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేశారు. ఏపీలో రౌడీషీట్ వున్న వ్యక్తులు ఓటర్లను బెదిరించారని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. కౌంటింగ్ హాల్‌లో నూకల సాంబశివరావు (nukala samba siva rao) అనే రౌడీ షీటర్ వున్నాడని ఆయన చెప్పారు

prakash raj complains against ycp leaders due to maa elections
Author
Hyderabad, First Published Oct 22, 2021, 2:34 PM IST

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (movie artists association) ‘‘మా’’ ఎన్నికలు (maa elections) ముగిసినా ఫిలింనగర్‌లో (film nagar) వేడి ఇంకా తగ్గలేదు. ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్‌పై ప్రకాశ్ రాజ్ (prakash raj) సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో సుప్రీంకోర్టుకెక్కేందుకు (supreme court) ఆయన  సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం జరిగింది. ఇందుకోసమే మా ఎన్నికలు, కౌంటింగ్ జరిగిన నాటి ఫుటేజ్ తనకు కావాలని ప్రకాశ్ రాజ్... మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు (krishna mohan) లేఖ రాశారు. రెండు రోజుల పాటు సైలెంట్‌గానే వున్న ప్రకాశ్ రాజ్.. తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

బయటివాళ్లు ఓటర్లను బెదిరించారని ఆయన మా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఏపీలో రౌడీషీట్ వున్న వ్యక్తులు ఓటర్లను బెదిరించారని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. కౌంటింగ్ హాల్‌లో నూకల సాంబశివరావు (nukala samba siva rao) అనే రౌడీ షీటర్ వున్నాడని ఆయన చెప్పారు. 14వ తేదీనే ఈ విషయాన్ని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశామని.. అయినా స్పందించలేదని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. కృష్ణా జిల్లా (krishna district) జగ్గయ్యపేటలో (jaggaiah pet) సాంబశివరావుపై రౌడీషీట్ వుందని ఆయన తెలిపారు. 

Also Read:`రింగ్ మాస్టర్‌ నువ్వే`.. వర్మకి మంచు మనోజ్‌ దిమ్మతిరిగే కౌంటర్‌..

గతంలో ముగ్గురు  ఎస్సైల్ని కొట్టిన ఘటనతో పాటు ఓ హత్య కేసులోనూ సాంబశివరావు నిందితుడిగా వున్నారు. నోట్ల రద్దు సమయంలోనూ సాంబశివరావుపై ఆరోపణలు వున్నాయి. కాగా…. మా అర్టిస్ట్‌ అసోషియేషన్‌ ఎన్నికల సమయంలో… మోహన్‌ బాబు (mohan babu) మరియు మంచు విష్ణు ప్యానెల్‌ (manchu vishnu) సభ్యులు ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్‌ సభ్యుల పై దాడులు చేసిన సంగతి తెలిసిందే.దీంతో ఈ మా అర్టిస్ట్‌ అసోషియేషన్‌ ఎన్నికలు వివాదంగా మారాయి.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌` ఎన్నికలు అక్టోబర్ 10న జరిగిన విషయం తెలిసిందే. మంచు విష్ణు, ప్రకాష్‌రాజ్‌ పోటీ పడగా, మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలుపొందారు. ప్రకాష్‌రాజ్‌ ప్యానెల్‌ నుంచి 11 మంది విజయంసాధించారు. కానీ పోలింగ్‌లో అవకతవకలు జరిగాయని, లెక్కింపులో అన్యాయం జరిగింది, తమపై మోహన్‌బాబు దాడి చేశారని ప్రకాష్‌రాజ్‌ ప్యానెల్‌ సభ్యులు ఆరోపించారు. అంతేకాదు ఇందులో తాము కొనసాగలేమని రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు మరోసారి సంచలనం సృష్టించాయి. 

 

Follow Us:
Download App:
  • android
  • ios