సినీ సెలబ్రిటీల లవ్‌ స్టోరీలు ఇటీవల పెద్ద వివాదంగా మారుతున్నాయి. ఆ మధ్య తెలుగు సీరియల్‌ నటి శ్రావణి ఆత్మహత్యకు కారణం లవ్‌స్టోరీనే అని తేలింది. మరోవైపు బిగ్‌బాస్‌ హౌజ్‌లో మోనాల్‌, అభిజిత్‌, అఖిల్‌ లవ్‌ స్టోరీ పెద్ద దుమారం రేపుతుంది. తాజాగా మరో సెలబ్రిటీకి చెందిన లవ్‌ స్టోరీ వివాదంగా మారింది.

తెలుగు, తమిళ హీరోయిన్‌ సనంశెట్టి, నటుడు, తమిళ బిగ్‌బాస్‌` ఫేమ్‌ దర్శిన్‌ మధ్య గత కొంత కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తుంది. వీరిద్దరు పెళ్ళికి కూడా సిద్ధమయ్యారట. కానీ తనని దర్శిన్‌ మోసం చేశాడని ఆరోపిస్తుంది హీరోయిన్‌ సనంశెట్టి. ఈ మేరకు ఆమె దర్శిన్‌పై అడయారు మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

ఈ సందర్బంగా సనంశెట్టి చెబుతూ, దర్శిన్‌, నేను ప్రేమించుకున్నాం. ఏడాదిపాటు కలిసి తిరిగినం. పెళ్ళి కూడా చేసుకోవాలని అనుకున్నాం. కానీ దర్శిన్‌ ఉన్నట్టుండి నాతో మాట్లాడటం మానేశాడు. నన్ను మ్యారేజ్‌ చేసుకునేందుకు నో చెబుతున్నాడు. ఇలా నమ్మించి మోసం చేసిన దర్శిన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నా` అని తెలిపింది. 


ఇదిలా ఉంటే సనంశెట్టి ఫిర్యాదుపై విచారణ జరిపిన పోలీసులు దర్శిన్‌పై కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. దీంతో ఆమె కోర్ట్ కి వెళ్ళింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు దర్శిన్‌ పై కేసు నమోదు చేశారు. దర్శిన్‌ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది.