మరో 5 రోజుల్లో తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రం విడుదల కాబోతోంది. ఒక తెలుగు యోధుడి కథని ఎలా తెరకెక్కించారనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. సురేందర్ రెడ్డి ఈ తరం ప్రేక్షకులకు అర్థమయ్యేలా, అద్భుతమైన స్క్రీన్ ప్లేతో సైరా చిత్రాన్ని తెరకెక్కించారు. 

చిత్ర విడుదల సమయం దగ్గరపడుతుండటంతో మెగా క్యాంప్ ప్రమోషన్స్ జోరు పెంచింది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజవుతున్న సైరా చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి చిరంజీవి ముంబైలో దిగిపోయారు. ముంబై మీడియా కూడా సైరా చిత్రంపై ఆసక్తి కనబరుస్తోంది. బిగ్ బి అమితాబ్ సైరా చిత్రంలో నటించడంతో నార్త్ లో కూడా ఈ చిత్రానికి క్రేజ్ వచ్చింది. 

ఇదిలా ఉండగా బాలీవుడ్ హీరో ఫరాన్ అక్తర్ సైరా చిత్రాన్ని తన ఎక్సయిల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రిలీజ్ చేస్తున్నాడు. ఫరాన్ సైరా ప్రమోషన్ లో భాగంగా చిరంజీవి, అమితాబ్ ఇద్దరినీ ఒకే వేదికపై ఇంటర్వ్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. 

దాదాపు రెండు గంటల పాటు చిరు, అమితాబ్ ఇండియన్ సినిమా గురించి పలు విషయాలని ఈ ఇంటర్వ్యూలో పంచుకోనున్నారు. ఇక చిరంజీవి సైరా చిత్ర విశేషాలు చెబుతూనే.. తెలుగు వీరుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి.. ఆయన జీవిత చరిత్రపై సినిమా తీసేందుకు తనకు కలిగిన ఆసక్తి గురించి వివరించనున్నారు. బాలీవుడ్ మీడియా మొత్తం ఈ చిరు, అమితాబ్ చెప్పే ఆసక్తికర విషయాల కోసం ఎదురుచూస్తోంది. 

నయనతార సైరా చిత్రంలో కథానాయికగా నటించింది. నరసింహారెడీ గురువు పాత్రలో అమితాబ్ నటించారు. తమన్నా, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 

ఇవి కూడా చదవండి: 

'సైరా' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..!

మెగాస్టార్ 'సైరా'కి ఈ టెన్షన్లు తప్పవా..?

'సైరా'కి ఇక అడ్డులేదు.. ఉయ్యాలవాడ కుటుంబీకులకు షాక్!

పవన్ కళ్యాణ్ కూడా సైరా కథ అడిగాడు.. మా డైలాగ్స్ లేకున్నా పర్వాలేదు!

బ్రేకింగ్: సైరాకు హైకోర్టులో షాక్.. ఏం జరగబోతోంది!

సైరా ట్రైలర్, టీజర్ ఎఫెక్ట్.. హిందీలో ఆశ్చర్యపరిచేలా!

'సైరా' ప్రీమియర్ షో కలెక్షన్లు.. రికార్డులు బద్ధలవ్వాల్సిందే!

సైరా : నొస్సం కోట యుద్ధం విశేషాలు 

లీకైంది: ‘సైరా నరసింహారెడ్డి’ మెయిన్ ట్విస్ట్ ఇదే!

మెగాస్టార్ సైరా ఫీవర్: భోజన ప్రియులకు బంపర్ ఆఫర్లు

హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న సైరా టికెట్లు.. బెంగుళూరులో స్పెషల్ షోలు!

సిరివెన్నెల లిరిక్స్.. వాళ్ళిద్దరి వాయిస్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

'సైరా' సెన్సార్ కంప్లీట్.. సినిమా రన్ టైం ఎంతో తెలుసా!