ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా చిత్రాన్ని తెరక్కించారు. కర్నూలు ప్రాంతానికి చెందిన తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ. ఆయన కథతో సినిమా తీయాలని చిరంజీవి ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు. ఎట్టకేలకు ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

దక్షణాది అన్ని భాషలతో పాటు హిందీలో కూడా ప్రపంచ వ్యాప్తంగా సైరా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. టీజర్, ట్రైలర్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. హిందీలో కూడా సైరా చిత్రంపై అంచనాలు పెరిగాయి. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో ఒక్కసారిగా సైరా చిత్రంపై హిందీ మార్కెట్ లో మంచి బజ్ ఏర్పడింది. 

ఫరాన్ అక్తర్ కు తన ఎక్సయిల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సైరా చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేస్తున్నాడు. దాదాపు 1500 స్క్రీన్స్ లో సైరా మూవీ హిందీ వర్షన్ రిలీజ్ కు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. తెలుగు సినిమాకు ఈ స్థాయిలో హిందీలో స్క్రీన్స్ కేటాయించడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. 

నయనతార ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా కీలక పాత్రల్లో నటించారు. 

'సైరా' ప్రీమియర్ షో కలెక్షన్లు.. రికార్డులు బద్ధలవ్వాల్సిందే!

సైరా : నొస్సం కోట యుద్ధం విశేషాలు 

లీకైంది: ‘సైరా నరసింహారెడ్డి’ మెయిన్ ట్విస్ట్ ఇదే!

మెగాస్టార్ సైరా ఫీవర్: భోజన ప్రియులకు బంపర్ ఆఫర్లు

హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న సైరా టికెట్లు.. బెంగుళూరులో స్పెషల్ షోలు!

సిరివెన్నెల లిరిక్స్.. వాళ్ళిద్దరి వాయిస్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

'సైరా' సెన్సార్ కంప్లీట్.. సినిమా రన్ టైం ఎంతో తెలుసా!