Asianet News TeluguAsianet News Telugu

మెగాస్టార్ 'సైరా'కి ఈ టెన్షన్లు తప్పవా..?

మెగాస్టార్ మెగా మూవీ సైరా మీద ఉన్నట్లుండి బోలెడు వార్తలు వినిపించండం ప్రారంభమైంది. 

last minute tensions for syeraa
Author
Hyderabad, First Published Sep 27, 2019, 11:56 AM IST

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో సినిమా ప్రమోషన్స్ ముమ్మరం చేశారు. ఇది ఇలా ఉండగా.. ఈ సినిమాకి సంబంధించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించి కోర్టులో వాదనలు జరిగాయని, దర్శకుడు సురేందర్ రెడ్డి కోర్టులో వాంగ్మూలం ఇచ్చారని.. అప్పుడే సెన్సార్ వచ్చిందని.. ఇంకా బాలీవుడ్ సెన్సార్ కాలేదని ఇలా చాలానే వినిపించాయి.

మరోపక్క హిందీ భారీ సినిమా 'వార్' హైదరాబాద్, విశాఖ, విజయవాడ లాంటి ప్రాంతాల  మల్టీప్లెక్స్ విషయంలో గట్టి పట్టుపడుతోందని.. తమ సినిమాకి కూడా సగం స్క్రీన్ లు కేటాయించాలని లేఖలు రాసిందని వార్తలు వినిపించాయి. 'వార్' సినిమా నిర్మించిన యష్ రాజ్ సంస్థ కూడా పెద్దదే కాబట్టి దాని మాటలు మల్టీప్లెక్స్ లు అంత సులువుగా పక్కనపెట్టలేవు.

దీంతో ఇప్పుడు చర్చలు మొదలయ్యాయి. దాంతో ఇప్పటివరకు హైదరాబాద్ లో కీలకమైన స్క్రీన్లకు ఆన్లైన్ బుకింగ్స్ మొదలుకాలేదు. ఇది ఇలా ఉండగా.. 'సైరా' తెలుగు వెర్షన్ కు వచ్చిన సర్టిఫికేట్ ఆధారంగా చేసుకొని హిందీ వెర్షన్ ను డబ్బింగ్ గా చూపించి అక్కడ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సివుంది. 

ఈరోజు దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ చేయనున్నారు. సినిమా రిలీజ్ కి మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. సెన్సార్ సర్టిఫికేట్, థియేటర్ల కన్ఫర్మేషన్ వస్తే తప్ప బుకింగ్స్ తెరుచుకోవు. మొత్తంగా చూసుకుంటే ఎంత ప్లాన్ గ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నా.. ఆఖరి నిమిషంలో టెన్షన్లు తప్పడం లేదు. 

'సైరా'కి ఇక అడ్డులేదు.. ఉయ్యాలవాడ కుటుంబీకులకు షాక్!

పవన్ కళ్యాణ్ కూడా సైరా కథ అడిగాడు.. మా డైలాగ్స్ లేకున్నా పర్వాలేదు!

బ్రేకింగ్: సైరాకు హైకోర్టులో షాక్.. ఏం జరగబోతోంది!

సైరా ట్రైలర్, టీజర్ ఎఫెక్ట్.. హిందీలో ఆశ్చర్యపరిచేలా!

'సైరా' ప్రీమియర్ షో కలెక్షన్లు.. రికార్డులు బద్ధలవ్వాల్సిందే!

సైరా : నొస్సం కోట యుద్ధం విశేషాలు 

లీకైంది: ‘సైరా నరసింహారెడ్డి’ మెయిన్ ట్విస్ట్ ఇదే!

మెగాస్టార్ సైరా ఫీవర్: భోజన ప్రియులకు బంపర్ ఆఫర్లు

హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న సైరా టికెట్లు.. బెంగుళూరులో స్పెషల్ షోలు!

సిరివెన్నెల లిరిక్స్.. వాళ్ళిద్దరి వాయిస్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

'సైరా' సెన్సార్ కంప్లీట్.. సినిమా రన్ టైం ఎంతో తెలుసా!

Follow Us:
Download App:
  • android
  • ios