- Home
- Entertainment
- Chiranjeeviకి ఊహించని గిఫ్ట్ తో సర్‌ప్రైజ్ చేసిన కృష్ణంరాజు.. మెగాస్టార్ మర్చిపోలేని బర్త్ డే
Chiranjeeviకి ఊహించని గిఫ్ట్ తో సర్‌ప్రైజ్ చేసిన కృష్ణంరాజు.. మెగాస్టార్ మర్చిపోలేని బర్త్ డే
మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ కృష్ణంరాజు మధ్య మంచి అనుబంధం ఉంది. అయితే ఓ పుట్టిన రోజు చిరంజీవికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు కృష్ణంరాజు. అదేంటనేది చూస్తే.

చిరంజీవి, కృష్ణంరాజు మధ్య అనుబంధం
మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ కృష్ణంరాజు మధ్య మంచి అనుబంధం ఉండేది. కృష్ణంరాజుని చిరంజీవి అన్న అని పిలిచేవారట. సినిమాల్లోకి రాకముందు నుంచే వీరి ఫ్యామిలీలు బాగా తెలుసు. చిరంజీవి తాతని కృష్ణంరాజు బూతుల రాయుడు అని పిలిచేవారట. ఆయన పోలీస్‌గా రిటైర్ అయ్యాక పిండి గిన్రీని నడిపించేవారట. ఆ ప్లేస్ ని కృష్ణంరాజు ఫ్యామిలీనే ఇచ్చారట. అలా వారి మధ్య మంచి అనుబంధం ఉండేదట.
చిరంజీవిని ప్రోత్సహించిన కృష్ణంరాజు
చిరంజీవిని ప్రారంభంలో ప్రోత్సహించింది కూడా రెబల్ స్టార్ కృష్ణంరాజునే అని అంటుంటారు. `మనవూరి పాండవులు`లో చిరంజీవిని తీసుకోవడానికి కారణం కూడా రెబల్ స్టార్ అంటుంటారు. ఈ సినిమా అప్పట్లో పెద్ద విజయం సాధించింది. అప్పటి నుంచి చిరంజీవి, కృష్ణంరాజు మధ్య అనుబంధం కొనసాగుతుంది. అదే రెస్పెక్ట్ చిరంజీవిపై ప్రభాస్‌లోనూ ఉంటుంది. వీరి మధ్య ఆ రిలేషన్ చివరి వరకు కొనసాగింది.
ఖరీదైన కెమెరా కొన్న కృష్ణంరాజు
ఇదిలా ఉంటే ఓ సారి చిరంజీవికి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు కృష్ణంరాజు. ఆ విషయాన్ని ఆయనే వెల్లడించారు. కృష్ణంరాజు ఓ సారి లండన్‌లో ఖరీదైన కెమెరా కొన్నారు. అది బ్యాక్ గ్రౌండ్‌లో ఎండ ఉన్నా కూడా లైటింగ్ తగ్గించి కూల్‌గా పడుతుందట. చీకట్లో ఉన్నా, లైటింగ్ అడ్జస్ట్ చేస్తుందట. అప్పట్లో అదే అత్యంత ఖరీదైన కెమెరా. ఇండియాలో దొరకడం చాలా అరుదు. లండన్ వెళ్లినప్పుడు కృష్ణంరాజు కొన్నారు.
చిరంజీవికి బర్త్ డే రోజు ఊహించని సర్‌ప్రైజ్ చేసిన కృష్ణంరాజు
చిరంజీవి పుట్టిన రోజుకి కృష్ణంరాజుకి పిలుపొచ్చింది. పార్టీకి వెళ్లేటప్పుడు ఆ కెమెరా తీసుకుని, తన మేనల్లుడుని తీసుకొని వెళ్లాడు కృష్ణంరాజు. బర్త్ డేలో ఫోటోలు తీస్తుంటే చిరంజీవి చూశారు. అరే సర్‌ప్రైజ్ అయ్యారట. `హా.. అన్నయ్య ఇది ఎక్కడ కొన్నావ్, లండన్‌లో చూశాను, చాలా కాస్ట్లీ అని వదిలేశాను. ఎక్కడ కొన్నావ్ అన్నాడట చిరంజీవి. చిరులోని ఆ ఆనందం, ఎగ్జైట్‌మెంట్‌ని చూసిన కృష్ణంరాజు వెంటనే దాన్ని తీసుకొని చిరంజీవి మెడలో వేశాడట. ఇదే నా బర్త్ డే గిఫ్ట్ అన్నాడట. దెబ్బకి మెగాస్టార్ నోట వెంట మాట రాలేదు. ఆ పుట్టిన రోజుని చాలా స్పెషల్‌గా మార్చేశారు రెబల్ స్టార్. దాన్ని చిరంజీవి కూడా ఎప్పుడూ మర్చిపోలేరట.
టాలీవుడ్‌లో దిగ్గజ నటుడిగా రాణించిన రెబల్ స్టార్
ఈ విషయాన్ని కృష్ణంరాజు ఐడ్రీమ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం అది వైరల్‌గా మారడం విశేషం. ఇక కృష్ణంరాజు మూడేళ్ల క్రితం అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. రెబల్ స్టార్‌గా టాలీవుడ్‌లో పాపులర్ కృష్ణంరాజు. యాక్షన్ చిత్రాలతో మెప్పిస్తూనే, మహిళా సాధికారతతో కూడిన సినిమాలు చేసి మెప్పించారు. తన టేస్ట్ ని పంచుకున్నారు. టాలీవుడ్ లో దిగ్గజ నటుడిగా ఎదిగారు. ఆయన వారసుడిగా ప్రభాస్ రాణిస్తున్న విషయం తెలిసిందే. తండ్రిని మించిన తనయుడిగా రాణిస్తున్నారు.
మన శంకరవరప్రసాద్ గారుతో సందడి చేస్తోన్న చిరు
ఇక చిరంజీవి ప్రస్తుతం `మన శంకరవరప్రసాద్ గారు` చిత్రంలో నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ తో రూపొందిస్తున్నారు అనిల్ రావిపూడి. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఇప్పటికే రెండు పాటలు విడుదలై ఆకట్టుకుంటోన్న విషయం తెలిసిందే. దీంతోపాటు `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు చిరంజీవి. ఇది వీఎఫ్‌ఎక్స్ వర్క్ జరుపుకుంటోంది. దీంతోపాటు బాబీ దర్శకత్వంలో ఓ సినిమా, శ్రీకాంత్ ఓడెల దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.

