Asianet News TeluguAsianet News Telugu

`డోన్ట్ బ్రీత్-2` తెలుగులో, రిలీజ్ డేట్


కిడ్నాప్‌కు గురైన త‌న 11 ఏళ్ళ కుమార్తె కోసం అంధుడైన తండ్రి ఏం చేశాడు? అదేవిధంగా స్టీఫెన్‌లో దాగివున్న అద్భుత శ‌క్తులు ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చాయి? వాటివల్ల ఏం జ‌రిగింది?  

Dont Breathe 2 to release in India on September 17
Author
Hyderabad, First Published Sep 15, 2021, 11:49 AM IST

ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లై ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో  సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం `డోన్ట్ బ్రీత్`. 2016లో విడుద‌లైన ఈ హార్ర‌ర్ చిత్రానికి సీక్వెల్‌గా డోన్ట్ బ్రీత్ 2 తెర‌కెక్కింది. ఇంగ్లీషు, తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్ల‌లో విడుద‌లకాబోతుంది. ఈనెల 17న సోనీ పిక్చ‌ర్స్ ద్వారా థియేట‌ర్ల‌లో రాబోతుంది. నూత‌న ద‌ర్శ‌కుడు రోడో సాయాగ్స్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందింది. స్టీఫెన్ లాగ్‌, మేడ్‌లిన్‌గ్రేన్ తండ్రీ కూతుళ్ళుగా న‌టించారు.

కిడ్నాప్‌కు గురైన త‌న 11 ఏళ్ళ కుమార్తె కోసం అంధుడైన తండ్రి ఏం చేశాడు? అదేవిధంగా స్టీఫెన్‌లో దాగివున్న అద్భుత శ‌క్తులు ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చాయి? వాటివల్ల ఏం జ‌రిగింది? చివ‌ర‌కు త‌న కుమార్తెను కాపాడుకున్నాడా? లేదా? అనేది ఆస‌క్తిక‌రంగా ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించాడు. కాగా, ఈ చిత్రాన్ని దేశ‌వ్యాప్తంగా వెయ్యి ధియేర్ల‌లో విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నామ‌నీ, ఈనెల 17 విడుద‌ల‌కాబోతున్న మా సినిమా ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ క‌లిగిస్తోంద‌ని సోనీ పిక్చ‌ర్స్ ప్ర‌తినిధులు తెలియ‌జేశారు.

వాస్తవానికి డోన్ట్ బ్రీత్' విడుదల స‌మ‌యానికి దాన్ని ఫ్రాంచైజీగా చెయ్యాల‌ని నిర్మాత‌లు అనుకోలేదు. ఆ ఏడాది స‌మ్మ‌ర్‌కు రిలీజైన ఆ మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్‌బ‌స్ట‌ర్ కావ‌డంతో పాటు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందింది. లో బ‌డ్జెట్‌తో నిర్మాణ‌మైన ఆ సినిమా 160 మిలియ‌న్ల కంటే కాస్త త‌క్కువ‌గా వ‌సూళ్లు సాధించింది. ఇది ఎవరూ ఊహించలేదు. దాంతో దానికి సీక్వెల్ తియ్యాల‌నే ఆలోచ‌న మేక‌ర్స్‌కు క‌లిగింది. ఫ‌లితంగా త్వ‌ర‌లో 'డోన్ట్ బ్రీత్ 2' తీసుకువస్తున్నారు. ఒరిజిన‌ల్‌లో అంధుడైన నార్మ‌న్ నోర్డ్‌స్ట్రామ్‌గా న‌టించిన స్టీఫెన్ లాంగ్ ఈ సీక్వెల్‌లో త‌న క్యారెక్ట‌ర్‌ను కంటిన్యూ చేయటం ప్లస్ అయ్యిందంటున్నారు.
 
లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ఈ సీక్వెల్ ట్రైల‌ర్ ఒరిజిన‌ల్ కంటే ఈ మూవీ మ‌రింత టెర్ర‌రైజ్ చేస్తోంది. అంధుడిగా స్టీఫెన్ లాంగ్ న‌ట‌న‌, ఆయ‌న చేసే ఫైట్లు రోమాలు నిక్క‌బొడుచుకొనేలా, ఒళ్లు జ‌ల‌దరింప‌జేసేలా క‌నిపిస్తున్నాయి. సినిమాటోగ్ర‌ఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్ హైలైట్ అవుతున్నాయి. 17న 'డోన్ట్ బ్రీత్ 2' థియేట‌ర్ల‌లో రిలీజ్ కానున్న‌ది. చూసి, థ్రిల్ అవ‌డ‌మే త‌రువాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios