Asianet News TeluguAsianet News Telugu

400 మంది డాన్సర్ తో ఐశ్వర్య రాయ్ సాంగ్... పొన్నియిన్ సెల్వన్ కోసం మణిరత్నం భారీ ప్రయత్నం!

ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ పై మణిరత్నం ఓ భారీ సాంగ్ షూట్ చేశారట. ఈ సాంగ్ లో ఐశ్వర్య రాయ్ తో పాటు ఏకంగా 400 మంది డాన్సర్ పాల్గొన్నారట.

director maniratnam shot  a song on aishwarya rai  with huge set up for ponniyin selvan
Author
Hyderabad, First Published Sep 14, 2021, 2:11 PM IST

ఐకానిక్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ పొన్నియిన్ సెల్వన్. భారీ క్యాస్టింగ్ తో మణిరత్నం ఈ చిత్రాన్ని రెండు భాగాలు తెరకెక్కిస్తున్నారు. రచయిత కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ మొదటి భాగం షూటింగ్ చివరి దశకు చేరినట్లు సమాచారం. కాగా ఇటీవల మధ్యప్రదేశ్ లో పొన్నియిన్ సెల్వన్ మూవీ షూటింగ్ నిర్వహించారు. 


మధ్యప్రదేశ్ షెడ్యూల్ నందు ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ పై మణిరత్నం ఓ భారీ సాంగ్ షూట్ చేశారట. ఈ సాంగ్ లో ఐశ్వర్య రాయ్ తో పాటు ఏకంగా 400 మంది డాన్సర్ పాల్గొన్నారట. మూవీలో ఈ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుండగా, భారీ బడ్జెట్ కేటాయించి చిత్రీకరించారట. 


విక్రమ్ ప్రధాన పాత్ర చేస్తున్న ఈ మూవీలో త్రిష, కార్తీ, జయం రవి, ప్రకాష్ రాజ్, జయరామ్ వంటి అత్యుత్తమ నటులు నటిస్తున్నారు. పొన్నియిన్ సెల్వన్ మొదటి భాగం, సమ్మర్ కానుకగా 2022లో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. 

Follow Us:
Download App:
  • android
  • ios