Asianet News TeluguAsianet News Telugu

భర్తతో మనస్పర్థలు... నిహారిక కోసం రంగంలోకి దిగిన చిరంజీవి?

నిహారికకు భర్త వెంకట చైతన్యతో విబేధాలు తలెత్తాయని లేటెస్ట్ టాక్. ఈ క్రమంలో సంధి చేసేందుకు పెదనాన్న చిరంజీవి రంగంలోకి దిగారట. 
 

chiranjeevi takes initiation to reunite niharika with her husband venkata chaitanya
Author
First Published Mar 20, 2023, 11:08 PM IST

నిహారిక విడాకుల పుకార్లు టాలీవుడ్ లేటెస్ట్ హాట్ టాపిక్. గత 24 నాలుగు గంటలుగా ఈ న్యూస్ పరిశ్రమను ఊపేస్తోంది. ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ మీడియా ప్రతినిధులు కొన్ని ఆధారాలు చూపుతూ తమ వాదనలు వినిపిస్తున్నారు. నిహారిక-వెంకట చైతన్య ఒకరినొకరు సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకున్నారు. నిహారిక భర్త వెంకట చైతన్య అయితే ఏకంగా పెళ్లి ఫోటోలు ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుండి డిలీట్ చేశారు. నిహారికతో విందులు, వినోదాలు, విహారాలు వంటి స్వీట్ మెమోరీస్ సైతం తొలగించాడు. 

ఈ పరిణామాలు నిహారిక విడాకుల వార్తలకు కారణమయ్యాయి. ఇటీవల సమంతతో పాటు కొందరు సెలెబ్రిటీలు విడాకులకు ముందు ఇదే పద్ధతి పాటించారు. సమంత తన పేరు నుండి సర్ నేమ్ అక్కినేని తొలగించింది. ఇక చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజా  సైతం సోషల్ మీడియా ద్వారానే హింట్ ఇచ్చింది. నిహారిక భర్తను అన్ ఫాలో కావడంతో అనుమానాలు బలపడ్డాయి. 

chiranjeevi takes initiation to reunite niharika with her husband venkata chaitanya

తాజా సమాచారం ప్రకారం నిహారిక-వెంకట చైతన్య మధ్య మనస్పర్థలు నిజమేనని, చిరంజీవి సర్ది చెప్పేందుకు రంగంలోకి దిగారని అంటున్నారు. నాగబాబుకు ఆవేశం ఎక్కువ, అందుకే చిరంజీవి ఒక్కడే వెంకట చైతన్య, అతని ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడి వివాదానికి తెర దింపాలనుకుంటున్నారట. వెంకట చైతన్య తండ్రి ప్రభాకర్ రావు చిరంజీవికి అత్యంత సన్నిహితుడు. ఆ విధంగా గొడవ పెద్దది కాకుండా విడాకులకు దారి తీయడకుండా ప్రయత్నాలు మొదలు పెట్టారట. 

ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రముఖంగా వినిపిస్తున్నాయి. నిహారిక 2020 డిసెంబర్ 9వ తేదీన గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ వెంకట చైతన్యను వివాహం చేసుకున్నారు. వెంకట చైతన్య తండ్రి ప్రభాకర్ రావు పోలీస్ అధికారి. ఆయనకు చిరంజీవి కుటుంబంతో చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ విధంగా సంబంధం కుదిరింది. 

రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ నిహారిక వివాహానికి వేదికైంది. ఐదు రోజులు ఘనంగా నిర్వహించారు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తో పాటు మెగా హీరోలందరూ ఈ వేడుకకు హాజరయ్యారు. పెళ్ళికి కుటుంబ సభ్యులకు మాత్రమే ఆహ్వానం లభించింది. పరిశ్రమ ప్రముఖులను పిలవలేదు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్ కి మాత్రం అందరినీ ఆహ్వానించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios