మెగాస్టార్ చిరంజీవికి నటుడిగా ఎన్నో ఏళ్ల అనుభవం ఉంది. టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగిన చిరు రీఎంట్రీలో కూడా తన సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం ఆయన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'సై రా' సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ స్పాట్ కి ఒకరోజు సురేందర్ రెడ్డి ఆలస్యంగా రావడంతో అప్పటికే సెట్ కి చేరుకున్న చిరు డైరెక్టర్ కుర్చీలో కూర్చున్నాడట. ఆరోజు తీయాల్సిన సన్నివేసం చదివి దాన్ని తనదైన స్టైల్ లో తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

చిరు డైరెక్ట్ చేసే సమయానికి అక్కడకి చేరుకున్న సురేంద రెడ్డి కెప్టెన్ కుర్చీలో ఉన్న చిరుని చూసి డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అతడి పక్కనే నిలబడి చూశాడట. షాట్ మొత్తం పూర్తయిన తరువాత సురేందర్ రెడ్డి టేకప్ చేశాడని తెలుస్తోంది. డైరెక్టర్ గా తన టాలెంట్ చూపించడం చిరుకి ఇది కొత్తేమీ కాదు..

గతంలో కూడా ఆయన కొన్ని కారణాల వలన దర్శకుడిగా వ్యవహరించాల్సి వచ్చింది. గ్యాంగ్ లీడర్ సినిమాలో కొన్ని సీన్స్ ని కూడా చిరునే డైరెక్ట్ చేశాడని చెబుతుంటారు. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. భారీ చారిత్రాత్మక చిత్రంగా రూపొందిస్తున్నారు. రామ్ చరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి.. 

'సై రా' లో స్టైలిష్ స్టార్ కి ఛాన్స్!

సైరా కథ వెనుక ఇంత కథ ఉందా?

సైరా టీజర్: ఉయ్యాలవాడ మహారాణి సిద్దమ్మ

'సైరా'.. చిరు కోసం మూడు రోజులు మాత్రమే!

'సైరా' ఆన్ లొకేషన్: డైరెక్టర్ పై అరిచేసిన చిరు..?

ఒలింపిక్ షూటర్ వద్ద మెగాస్టార్ ట్రైనింగ్!

'సై రా' విషయంలో అభిమానులకి నిరాశ తప్పదా..?

సైరా పిక్: న్యూ లుక్ తో అదరగొట్టిన మెగాస్టార్!

సైరా అప్డేట్: కట్టప్పలా వెన్నుపోటు పొడుస్తాడా?

సైరా అప్డేట్: అంతా మెగాస్టార్ వల్లే!

సైరా అప్డేట్: హైదరాబాద్ లో మెగా టీమ్ భారీ ప్లాన్!