ఈ టాప్ యాంకర్ అసలు తగ్గట్లేదుగా..

Bruna Abdullah goes topless for sultry photoshoot
Highlights

  • బాలీవుడ్ భామలకు తమ అందాలు చూపడానికి ఇప్పుడు సోషల్ మీడియా పెద్ద ప్లాట్ ఫార్మ్
  • ఇన్ స్టాగ్రామ్ - ట్విట్టర్ - ఫేస్ బుక్ సాక్షిగా హీరొయిన్లు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.​

బాలీవుడ్ భామలకు సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ తమ అందాలు పరచుకోవడానికి దర్శకనిర్మాతలను ఆకట్టుకోవడానికి మంచి వేదికగా మారుతోంది. ఒక పక్క అభిమానులను ఉచితంగా అలరిస్తూనే మరోపక్క అవకాశాల కోసం గేలం వేయడానికి ఇది చక్కగా ఉపయోగపడుతోంది. ఇన్ స్టాగ్రామ్ - ట్విట్టర్ - ఫేస్ బుక్ సాక్షిగా హీరొయిన్లు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. బ్రెజీలియన్ బ్యూటీ బ్రూనా అబ్దుల్లా కూడా అదే దారిలో ఉంది. పదకొండేళ్ళ క్రితం కాష్ సినిమా ద్వారా తెరకు పరిచయమైన ఈ హాట్ బ్యూటీ ఆ మధ్య అజిత్ తో బిల్లా 2 చేసింది కాని దానితో సహా కెరీర్ లో నటించిన సినిమాలన్నీ దాదాపు డిజాస్టర్లు కావడంతో మోడలింగ్ లోనే స్థిరపడిపోయింది. కొంత కాలం రియాలిటీ షోకు యాంకరింగ్ చేసిన బ్రూనా మళ్ళి బాలీవుడ్ ఛాన్సుల కోసం వల వేసే పనిలో పడింది. 

మీరు చూస్తున్న పిక్ స్వయంగా తను షేర్ చేసుకున్నదే. ఒంటి పై ఒక చిన్న జీన్స్ నిక్కర్ తప్ప ఇంకే ఆచ్చాదన లేకుండా ముప్పాతిక నగ్నంగా బ్రూనా ఇచ్చిన ఈ స్టిల్ చూస్తుంటే ఎంతవాడు కాని అనే పాట గుర్తుకు రాక మానదు. మోకాళ్ళపై వయ్యారంగా కూర్చుని వక్ష భాగాన్ని చేతులతో పూర్తి కప్పేసి తమకంతో కళ్ళు మూసుకుని యోగా అసనంతో బ్రూనా ఇచ్చిన ఫోజుకు రసిక రాజులు వారేవా అంటున్నారు. ఇదేదో సినిమాకు సంబంధించింది కాదు. వ్యక్తిగతంగా తన ఎకౌంటు లో షేర్ చేసుకున్న బ్రూనా తనను వాడుకోకపోవడంలో మీదే తప్పని చెప్పక చెప్పినట్టే. అయినా కొత్త కొత్త హీరొయిన్లు బాలీవుడ్ కు వెల్లువలా వస్తూ ఏ మాత్రం ఒళ్ళు దాచుకోకుండా అంగాంగ ప్రదర్శనలకు సై అంటుంటే సీనియర్ భామ బ్రూనాను పట్టించుకునేది ఎవరో కాలమే సమాధానం చెప్పాలి. ఉదాన్చో అనే హింది .సినిమా తప్ప ప్రస్తుతం ఇంకే ప్రాజెక్ట్ తన చేతుల్లో లేదు 

loader