బాలీవుడ్ మెగాస్టార్, బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ప్రఖ్యాత దాదాసాహేబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. ఆదివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనకు అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి అమితాబ్ సతీమణి జయాబచ్చన్, కుమారుడు అభిషేక్ బచ్చన్ పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు హాజరయ్యారు.

Also Read:అమితాబ్ బచ్చన్ కు ప్రఖ్యాత 'దాదాసాహెబ్ ఫాల్కే' అవార్డు!

2019వ సంవత్సరానికిగాను భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యున్నత పురస్కారంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అమితాబ్ బచ్చన్‌ని ఎంపిక చేస్తూ కేంద్రప్రభుత్వం సెప్టెంబర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇండియన్ సినిమా పితామహుడు దాదాసాహెబ్ పేరిట ప్రభుత్వం ప్రతి ఏడాది ఒకరిని ఈ అవార్డుకు ఎంపిక చేస్తున్న సంగతి తెలిసిందే. ఆశా బోస్లే, లతా మంగేష్కర్, రాజ్ కపూర్, బాలచందర్ లాంటి సినీ దిగ్గజాలు ఈ అవార్డుని అందుకున్నారు. తెలుగులో ఇప్పటి వరకు బిఎన్ రెడ్డి, ఎల్వి ప్రసాద్, ఏఎన్నార్, రామానాయుడు, కె విశ్వనాథ్ లాంటి టాలీవుడ్ దిగ్గజాలు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. 

Also Read:యాక్సిడెంట్ తర్వాత ఇంటికి.. వైరల్ అవుతున్న అమితాబ్ వీడియో!

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని మొట్టమొదట 1969లో ప్రారంభించారు. హిందీ నటి దేవిక రాణి మొదటి అవార్డుని సొంతం చేసుకున్నారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అమితాబ్ ఎలాంటి నటుడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.