బిగ్ బాస్2: యాపిల్ టాస్క్ లో ఆమె బూతులు తిడితే వింటూ కూర్చున్నావ్.. గీతాకి కౌశల్ షాక్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 28, Aug 2018, 12:21 PM IST
bigg boss2: kaushal comments on geethamadhuri
Highlights

బిగ్ బాస్ సీజన్ 2 మొత్తంలో యాపిల్ టాస్క్ సంగతి ఎవరూ మర్చిపోలేరు. ఆ టాస్క్ తోనే కౌశల్ కి, గీతామాధురిలకు ప్రేక్షకుల్లో గౌరవం ఎక్కువైంది. అప్పటి కంటెస్టెంట్ భానుశ్రీ టాస్క్ లో భాగంగా కౌశల్ తనని తాకరాని చోట తాకడంటూ ఆరోపణలు చేసింది

బిగ్ బాస్ సీజన్ 2 మొత్తంలో యాపిల్ టాస్క్ సంగతి ఎవరూ మర్చిపోలేరు. ఆ టాస్క్ తోనే కౌశల్ కి, గీతామాధురిలకు ప్రేక్షకుల్లో గౌరవం ఎక్కువైంది. అప్పటి కంటెస్టెంట్ భానుశ్రీ టాస్క్ లో భాగంగా కౌశల్ తనని తాకరాని చోట తాకడంటూ ఆరోపణలు చేసింది. ఆ సమయంలో ఆ వ్యవహారం మొత్తం గమనించిన గీతామాధురి.. భానుశ్రీ చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని, కౌశల్ ఆమెని అసభ్యకరంగా తాకలేదని స్పష్టం చేసింది.

గీతా నిజాయితీగా స్టాండ్ తీసుకోవడంతో ఆమెను అందరూ పొగిడారు. హోస్ట్ నాని సైతం ఆమెపై ప్రశంసలు కురిపించారు. శనివారం ఎపిసోడ్ లో కూడా నాని ఈ విషయాన్ని ప్రస్తావించాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా..? ఇప్పుడు కౌశల్.. గీతామాధురి యాపిల్ టాస్క్ లో ఏం చేసిందని హౌస్ మేట్స్ అందరి ముందు ఆమెను ప్రశ్నించాడు. దీంతో షాక్ అవ్వడం గీతా వంతైంది.

ఈరోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు నిర్వాహకులు. ఇందులో టాస్క్ కోసం గీతామాధురి, కౌశల్ ల మధ్య మాటల యుద్ధం జరిగింది. కౌశల్..  ''నాకేం పట్టింది మీకు గేమ్ చెప్పడానికి..'' అనగా ''ఒక్కోరోజు ఒక్కోలా మాట్లాడితే కష్టం..  ప్రతిసారి ఆయన సేవ్ అవ్వడానికి సింపతీ కోసం నన్ను తోసేస్తుంటే నేను భరించలేను'' అంటూ దీప్తితో గీతా చెబుతోన్న సమయంలో అసలు ''ఆపిల్ టాస్క్ లో ఆమె(భానుశ్రీ) బూతులు మాట్లాడుతుంటే మీరు పక్కనే ఉన్నారు.. మీరు విన్నారు.. ఏమైనా ఆపారా..?'' అంటూ గీతాకి షాక్ ఇచ్చాడు కౌశల్.

దీనికి వెంటనే తనీష్, దీప్తిలు మీరు మాట్లాడేది తప్పు ఆ విషయంలో గీతా మాత్రమే మీకు సపోర్ట్ గా నిలిచిందంటూ కౌశల్ కి చెప్పే ప్రయత్నం చేశారు. మరి ఈ ఎపిసోడ్ ఎన్ని గొడవలకు కారణమవుతుందో చూడాలి!

 

 

ఇవి కూడా చదవండి.. 

బిగ్ బాస్ హోస్ట్ గా నాకు ఎలాంటి రిగ్రెట్స్ లేవు.. నాని కామెంట్స్!

బిగ్ బాస్2: తనీష్ ని కావాలనే సేవ్ చేస్తున్నారా..?

'మీరు బిగ్ బాసా..?' కౌశల్ కి గణేష్ పంచ్!

loader