బిగ్ బాస్ షో పూర్తి కావడానికి మరో మూడు వారాలు మాత్రమే మిగిలి ఉంది. రీసెంట్ గా హౌస్ లోకి వచ్చిన నూతన్ నాయుడుతో కలిపి మొత్తం 11 మంది కంటెస్టెంట్లు హౌస్ లో ఉన్నారు. ఫైనల్స్ కి మాత్రం హౌస్ లో ఐదుగురు మాత్రమే ఉండాలి. అంటే ఇంకో రెండు వారాల్లో ముగ్గురు చొప్పున బయటకి పంపేయాల్సి ఉంటుంది. కానీ వారానికి ఇద్దరిని మాత్రమే బయటకి పంపే ఛాన్స్ ఉంది.

దీంతో నిన్నటి వారం నుండే డబుల్ ఎలిమినేషన్ పెట్టాలని అనుకున్నారు. కానీ తనీష్ ని కాపాడాలనే ఆలోచనతో హౌస్ నుండి పూజాని మాత్రమే బయటకి పంపించేశారు. గత వారం నామినేషన్స్ లో కౌశల్, పూజా, దీప్తి, తనీష్ లు ఉండగా.. వీరిలో అత్యధిక ఓట్లు కౌశల్ కి వచ్చాయి. ఆ తరువాత స్థానాల్లో దీప్తి, తనీష్, పూజాలు ఉన్నారు. డబుల్ ఎలిమినేషన్ అయితే ఈ వారం పూజాతో పాటు తనీష్ కూడా వెళ్లాలి.

తనీష్ ని ఎలిమినేట్ కాకుండా చూడడానికే ఆయన్ని సేవ్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. హౌస్ లో కౌశల్, తనీష్ ల మధ్య జరిగే పోరే షోకి అసలైన మసాలా.. తనీష్ ని పంపించేస్తే.. అది మిస్ అవుతుందని బిగ్ బాస్ కావాలనే తనీష్ ని ఎలిమినేట్ కాకుండా చూశారని అంటున్నారు. మరి ఈ వారం నుండి ఎంతమందిని ఎలిమినేట్ చేస్తారో చూడాలి!

ఇవి కూడా చదవండి.. 

'మీరు బిగ్ బాసా..?' కౌశల్ కి గణేష్ పంచ్!

బిగ్ బాస్2: ఎలిమినేషన్ లో పూజా రామచంద్రన్ అవుట్!