బిగ్ బాస్ హోస్ట్ గా నాకు ఎలాంటి రిగ్రెట్స్ లేవు.. నాని కామెంట్స్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 27, Aug 2018, 3:55 PM IST
I have no regrets hosting the Bigg Boss show says nani
Highlights

బిగ్ బాస్ సీజన్ 2 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు యంగ్ హీరో నాని. నటుడిగా అతడికి ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఓవర్సీస్ ప్రేక్షకుల్లో కూడా నాని సినిమాలంటే ఆసక్తిగా చూస్తుంటారు. అంతగా తన నేచురల్ పెర్ఫార్మన్స్ తో స్క్రీన్ మీద చెలరేగిపోతాడు.

బిగ్ బాస్ సీజన్ 2 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు యంగ్ హీరో నాని. నటుడిగా అతడికి ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఓవర్సీస్ ప్రేక్షకుల్లో కూడా నాని సినిమాలంటే ఆసక్తిగా చూస్తుంటారు. అంతగా తన నేచురల్ పెర్ఫార్మన్స్ తో స్క్రీన్ మీద చెలరేగిపోతాడు. అటువంటిది అతడిని బిగ్ బాస్ హోస్ట్ గా అనౌన్స్ చేసినప్పుడు కొందరు ఆశ్చర్యపోయారు. అసలు షోకి న్యాయం చేయగలడా..? అనే సందేహాలు కలిగాయి.

కానీ ఇప్పటివరకు నాని తన బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తూ వస్తున్నాడు. అయినప్పటికీ ఈ షోకి సంబంధించి సోషల్ మీడియాలో నానిని ట్రోల్ చేయడం ఎక్కువైంది. హౌస్ మేట్స్ లో కొందరి అభిమానులు నానిని టార్గెట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. నిజానికి ఒక రియాలిటీ షోని హోస్ట్ చేయడమనేది మామూలు విషయం కాదు. జనాలకి ఒక్కొక్కరికీ ఒక్కో పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. హోస్ట్ గా చేసే వ్యక్తి హౌస్ మేట్స్ కి ఇచ్చే సలహాలు, జడ్జిమెంట్ తో ప్రేక్షకులందరినీ సాటిస్ఫై చేయాలంటే అది సాధ్యమయ్యే పని కాదు.

అయితే ఈ షో విషయంలో నాని ఇమేజ్ తగ్గుతుందని, ఈ షో ఎందుకు ఒప్పుకున్నానా..? అని అనుకుంటున్నాడనే వార్తలు వినిపించాయి. తాజాగా హౌస్ మేట్స్ తో మాట్లాడిన నాని.. ఈ షోని హోస్ట్ చేస్తున్నందుకు తాను చింతించడం లేదని స్పష్టం చేశాడు.

'మొదట బిగ్ బాస్ హోస్ట్ గా ఆఫర్ వచ్చినప్పుడు నేను కూడా సందేహించాను. కానీ నేను దాన్ని ఛాలెంజ్ గా తీసుకున్నాను. ఈ షో చేస్తున్నందుకు నాకు ఎలాంటి రిగ్రెట్స్ లేవు. ఇంకా చెప్పాలంటే.. ఈ షో ద్వారా నేను చాలా విషయాలు నేర్చుకుంటున్నాను' అని చెప్పుకొచ్చారు. 

ఇవి కూడా చదవండి.. 

బిగ్ బాస్2: తనీష్ ని కావాలనే సేవ్ చేస్తున్నారా..?

'మీరు బిగ్ బాసా..?' కౌశల్ కి గణేష్ పంచ్!

loader