బిగ్ బాస్ సీజన్ 2 ఇప్పటికే 78 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. ఆదివారం ఎలిమినేషన్ లో పూజా రామచంద్రన్ బయటకి వచ్చేసిన సంగతి తెలిసిందే. ఇక సోమవారం ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియను మొదలుపెట్టారు బిగ్ బాస్. హౌస్ మేట్స్ ని డార్క్ గా ఉన్న ఒక చోటుకి పిలిపించి అక్కడ ఒక్కో కంటెస్టెంట్ ని ఎవరిని నామినేట్  చేయాలనుకుంటున్నారో.. కారణాలు చెప్పి చేయమని సూచించారు బిగ్ బాస్.

దాదాపు హౌస్ మేట్స్ అందరూ కూడా కౌశల్ ని నామినేట్ చేశారు. నూతన్, గణేష్ పేర్లు కూడా చెప్పారు. కౌశల్ వంతు రాగానే.. ఆయన ముందుగా గణేష్ పేరు చెప్పి తన ముందు కొన్ని వ్యాఖ్యలు చేశారు. నువ్ కామన్ మ్యాన్ కదా.. అని గణేష్ ని అడగగా అవును నేను కామన్ మ్యాన్ ని అనిచెప్పాడు..

కౌశల్ వెంటనే 'సోమరిపోతులకు ఈ బిగ్ బాస్ హౌస్ లో ఆస్కారం లేదు' అని అనగా.. 'మీరు బిగ్ బాసా..?' అని ప్రశ్నించాడు గణేష్. దీనికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు నిర్వాహకులు. దీన్ని బట్టి ఈరోజు ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ మరింత ఆసక్తికరంగా సాగుతుందనిపిస్తుంది. 

 


ఇవి కూడా చదవండి..

బిగ్ బాస్2: ఎలిమినేషన్ లో పూజా రామచంద్రన్ అవుట్!

బిగ్ బాస్2: ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకో.. గీతపై నాని కామెంట్స్!

బిగ్ బాస్2: నువ్ ఎవరు చెప్పడానికి..? కౌశల్ పై తనీష్ ఫైర్!