Asianet News TeluguAsianet News Telugu

మగాడివైతే వచ్చి ఆడు... సన్నీకి ప్రియ వైల్డ్ ఛాలెంజ్, కెప్టెన్సీ టాస్క్ లో బలప్రయోగానికి దిగిన కంటెస్టెంట్స్

ఈ వారం కెప్టెన్సీ కోసం జరిగిన టాస్క్ లో కంటెస్టెంట్స్ బలప్రయోగానికి దిగారు. ఎల్లో టీం, బ్లూ టీం గా ఇంటి సభ్యులను విడదీసిన బిగ్ బాస్ వాళ్ళ మధ్య ఓ టాస్క్ నిర్వహించారు. బలప్రయోగంతో కూడిన ఈ టాస్క్ లో గెలవడానికి కంటెస్టెంట్స్ శాయిశక్తులు ఉపయోగిస్తున్నారు.

bigg boss season 5 in captaincy task contestants turned so wild
Author
Hyderabad, First Published Sep 15, 2021, 2:43 PM IST

గత సీజన్స్ తో పోల్చితే బిగ్ బాస్ సీజన్ 5 బిగినింగ్ లోనే కఠిన టాస్క్ లతో సాగుతుంది. మొదటిరోజే 19మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి ఎంటర్ కాగా, సభ్యుల మధ్య ఏదో ఒక రూపంలో, వాగ్వాదాలు, గొడవలు జరుగుతున్నాయి. ఈ వారం కెప్టెన్సీ కోసం జరిగిన టాస్క్ లో కంటెస్టెంట్స్ బలప్రయోగానికి దిగారు. 

ఎల్లో టీం, బ్లూ టీం గా ఇంటి సభ్యులను విడదీసిన బిగ్ బాస్ వాళ్ళ మధ్య ఓ టాస్క్ నిర్వహించారు. బలప్రయోగంతో కూడిన ఈ టాస్క్ లో గెలవడానికి కంటెస్టెంట్స్ శాయిశక్తులు ఉపయోగిస్తున్నారు. ఆ క్రమంలో కంటెస్టెంట్ మధ్య గొడవలు, ఆరోపణలు తెలెత్తుతున్నాయి. 

ఎల్లో టీమ్ లో ఉన్న శ్వేత గేమ్ చాలా వైల్డ్ గా ఉందని బ్లూ టీమ్ సభ్యులు ఆరోపించారు. అవును సాయంత్రం అయితే శ్వేతకు దెయ్యం పట్టేస్తుంది, అనుకుంటా అంటూ నటి ప్రియ కామెంట్ చేశారు. అయితే విజె సన్నీపై ఆమె మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

మగాడివైతే వచ్చి ఆడు అంటూ... తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. మగాడివైతే లాంటి కామెంట్స్ వాడవద్దని ప్రియను ఉద్దేశిస్తూ సన్నీ అక్కడ నుండి వెళ్లిపోయారు. మొత్తంగా కెప్టెన్సీ టాస్క్ కఠినంగా సాగింది. ఇక ఈ వారానికి గాను ఎలిమినేషన్ లిస్ట్ లో ఏడుగురు ఉన్నారు. 

ఇక భారీ అంచనాల మధ్య బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సెవెన్ ఆర్ట్స్ సరయు మొదటివారమే ఎలిమినేట్ అయ్యారు. షో నుండి బయటికి వచ్చిన సరయు కంటెస్టెంట్స్ సిరి హన్మంత్, సన్నీ, రవిలతో పాటు షణ్ముఖ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios