ప్రముఖ ర్యాప్‌ సింగర్‌, నటుడు నోయల్‌ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి శ్యాముల్‌ కన్నుమూశారు. 

బిగ్‌ బాస్‌ ఫేమ్‌, ర్యాంప్‌ సింగర్‌, నటుడు నోయల్‌ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. నోయల్‌ తండ్రి శనివారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నోయల్‌ తండ్రి శ్యామూల్‌ శనివారం రాత్రి మరణించగా, ఆ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో నోయల్‌ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. నోయల్ తండ్రి మరణ వార్త తెలిసి సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి, బిగ్‌ బాస్‌ 3 విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ వంటి ప్రముఖులు నివాళ్లు అర్పించారు. 

నోయల్‌కి తండ్రి శ్యాముల్ తో మంచి అనుబంధం ఉంది. ఇంట్లో తండ్రి,తనయుడు కలిసి చేసే అల్లరి వీడియోలను తరచూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టేవారు నోయల్‌. అలాంటి ఫాదర్‌ కన్నుమూయడంతో తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయారు. నోయల్‌ ర్యాప్‌ సింగర్‌గా, నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేస్తున్నారు. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

`ఈగ`, `కుమారి 21ఎఫ్‌`, `నాన్నకు ప్రేమతో`, `ప్రేమమ్‌` `నాన్న నేను నా బాయ్‌ ఫ్రెండ్‌ వంటి చిత్రాల్లో నటించారు నోయల్‌. నటుడిగా అడపాదపా సినిమాలు చేస్తూ నటుడిగా మెప్పిస్తున్నారు. మరోవైపు `బిగ్‌ బాస్‌ 4`లోనూ మెరిసిన విషయం తెలిసిందే. అనారోగ్యం కారణంగా ఆయన మధ్యలోనే హౌజ్‌ నుంచి తప్పుకున్నారు. అయితే పోతూ పోతూ..అవినాష్‌, అమ్మ రాజశేఖర్‌లపై తీవ్ర విమర్శలు చేస్తూ వెళ్లి దుమారం రేపారు. ప్రస్తుతం ర్యాప్‌ సింగర్‌గా, నటుడిగా సత్తా చాటుతున్నారు.