బిగ్ బాస్ సీజన్2 17 మంది కంటెస్టెంట్స్ మొదలైంది. మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా జరిగింది. వంద రోజులకి పైగా జరిగిన ఈ షోలో హౌస్ మేట్స్ మధ్య తగాదాలు, స్నేహాలు, ప్రేమలు అన్నీ చూపించారు. ఈ షో పూర్తయిన తరువాత కూడా కంటెస్టెంట్స్ అందరూ తమ స్నేహాన్ని కంటిన్యూ చేయాలనుకున్నారు. దాని కోసం ప్రతి వారం ఎవరో ఒకరి ఇంట్లో పార్టీని నిర్వహిస్తున్నారు.

అయితే ఇలా ఏర్పాటు చేస్తోన్న పార్టీలో బిగ్ బాస్ విన్నర్ కౌశల్ మాత్రం కనిపించడం లేదు. తాజాగా నందిని ఇంట్లో పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ వేడుకలో నందినితో పాటు.. సామ్రాట్, తనీష్, గీతామాధురి, రోల్ రైడా, దీప్తి సునైనా, తేజస్వి మదివాడ, భానుశ్రీ , శ్యామల, సంజన అన్నే, గణేష్ లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారంతా తీసుకున్న ఫోటోని షేర్ చేసిన నందిని.. తమ మధ్య స్నేహ బంధాన్ని కొనసాగించడానికి ఇటువంటి పార్టీలు చేసుకుంటున్నామని, దీని ద్వారా రెగ్యులర్ గా ఒకరితో ఒకరు టచ్ లో ఉంటామని.. ఈ స్నేహం ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నట్లు నందిని వెల్లడించింది. అయితే ఈ పార్టీకి కూడా కౌశల్ రాలేదు.

కంటెస్టెంట్స్ కౌశల్ కి ఫోన్ చేసి పిలవాలని ప్రయత్నిస్తున్నా ఆయన మాత్రం ఆన్సర్ చేయడం లేదని సమాచారం. బిగ్ బాస్ షో తరువాత కౌశల్ బాగా బిజీ అయిన సంగతి తెలిసిందే. ఆ కారణంగానే ఆయన ఈ పార్టీలకు హాజరు కావడం లేదు. అలానే తనకు హౌస్ మేట్స్ తో స్నేహం చేయడం ఇష్టం లేదని ఇటీవల కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు. 

ఇవి కూడా చదవండి.. 

రాజకీయాల్లోకి కౌశల్: జనసేనలో చేరుతారా...

వేలానికి బిగ్ బాస్ విన్నర్ కౌశల్ దుస్తులు!

బిగ్ బాస్ విన్నర్ కౌశల్ కి డబుల్ ప్రాఫిట్!

ఇప్పటికీ కౌశల్ ఎఫెక్ట్.. పాపం తనీష్ అదే స్దితిలో..?

కౌశల్ ఆర్మీతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫైట్.. పర్యవసానం ఇదే!

'షేడ్స్ ఆఫ్ సాహో'.. ప్రభాస్ లుక్ మాములుగా లేదుగా!

కౌశల్ కి అరుదైన గౌరవం.. ఆయన మాటల్లోనే!

కౌశల్ ఆర్మీ ఎఫెక్ట్.. హీరోయిన్ కి అవమానం!

నిరూపించండి.. టైటిల్ మీకే: బాబు గోగినేనికి కౌశల్ ఛాలెంజ్!

ట్రోలింగ్ ఆపించాల్సిన బాధ్యత కౌశల్ దే.. దీప్తి, సామ్రాట్ ఫైర్!

కౌశల్ విజయంపై దీప్తి ఆసక్తికర వ్యాఖ్యలు!

కౌశల్ హీరోగా సినిమా.. కౌశల్ ఆర్మీ సభ్యులే నిర్మాతలు!

పవన్ ఆరోజు చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి: బిగ్ బాస్ విన్నర్ కౌశల్!