Asianet News TeluguAsianet News Telugu

నా ప్యాంటులో ఎలుక దూరింది...బిగ్ బీ అమితాబ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ఆయన లైఫ్ లో జరిగిన ఓ ఫన్నీ సన్నివేశాన్ని గుర్తు చేసుకున్న బిగ్ బీ.. అది అబిమానులకు పంచుకున్నారు. 

Big B Amitabh bachchan shares funny post In Instagram
Author
First Published Feb 9, 2023, 3:16 PM IST

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ నట శిఖరం. ఆయన  నటించిన ఎన్నో  సినిమాలు ఎవర్ గ్రీన్ గా నిలిచాయి.  ఈక్రమంలో బిగ్ బీ నటించిన అద్భుత సినిమాల్లో ఒక్కటైన  దో ఔర్ దో పాంచ్  సినిమా రిలీజ్ అయ్యి  43 ఏళ్లు పూర్తి అయ్యింది.  ఈసందర్భంగా ఆ సినిమాను తలుచుకున్న అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో గుర్తు చేసుకున్నారు. అంతే కాదు ఈ సందర్భంగా  ఆయన  ఇన్‌స్టా లో ఓ ఆసక్తికర ఘటన గురించి చెపుతూ పోస్ట్ చేశారు. 

ఈ సినిమా టైమ్ లో ..అప్పట్లో తాను బెల్‌బాటమ్ ప్యాంటు ధరించేవారమని. అప్పట్లో అది ఫ్యాషన్ కనుక దాదాపు అన్ని సినిమాల్లో అవే ఉండేవన్నారు. ఈ సందర్భంలో పెద్దగా ఉన్న తన  ప్యాంటులోకి ఓ ఎలుక దూరిందని చెప్పుకొచ్చారు. దో ఔర్ దో పాంచ్ సినిమా వచ్చి 43 ఏళ్లయ్యింది. ఈ సినిమా షూటింగ్ ఎంత సరదాగా సాగిందో.. ఆ బెల్ బాటమ్ ప్యాంట్స్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు బెల్ బాటమ్ పాంట్ నే వేసుకుని  సినిమా చూడటానికి వెళ్లాను. అయితే..సీట్లో కూర్చున్న కాసేపటికే నా ప్యాంటులో ఓ ఎలుక దూరింది అంటూ.. ఫన్నీ సీన్ ను గుర్తు చేసుకున్నారు బిగ్ బీ.  అంతే కాదు  నవ్వుతున్న ఓ ఎమోజీని కూడా ఈ పోస్ట్ కు జతచేశారు. 

 

ఇక బిగ్ బీ పోస్ట్ పెడిగే స్పందన లేకుండా ఉంటుందా చెప్పండి. ఆయన ఇలా ఈ పోస్టు పెట్టారో లేదో..  నెటిజన్ల నుంచి భారీగా స్పందన వచ్చింది. అమితాబ్ బచ్చన్ బెల్‌బాటమ్ లుక్స్‌ను గుర్తు చేసుకున్న నెటిజన్లు ఆయన స్టైల్ ను.. సినిమాలను.. బిగ్ బీ నటనను గుర్తు చేసుకుంటూ.. పొగడ్తల్లో ముంచెత్తారు. అంతే కాదు అమితాబ్ బచ్చన్ నటన అప్పటికీ .. ఇప్పటికీ ఏం అదే ఎనర్జీతో కొనసాగుతంది అంటూ.. అబిమానులు గుర్తు చేసుకుంటున్నారు.  

ఇక 1980లో విడుదలైన ఈ చిత్రంలో హేమమాలిని, ఖదీర్ ఖాన్, ఓం ప్రకాశ్, శ్రీరామ్ లగూ తదితరులు నటించారు. ఈ మూవీకి రాకేశ్ కుమార్ దర్శకత్వం వహించగా సాండో ఎమ్ఎమ్ఏ చిన్నప్ప తేవర్ నిర్మించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios