Asianet News TeluguAsianet News Telugu

బాలయ్యని ఆ విషయంలో ఒప్పించలేం, చేతులెత్తేసారు!

 వినయ విధేయరామ చిత్రం తర్వాత బోయపాటి శ్రీను తన ఫేవెరెట్ నటుడు బాలయ్యతో కలిసి సినిమా ప్రారంభించారు. బిబి3 టైటిల్ తో వ్యవహరిస్తున్న ఈ సినిమాపై చాలా అంచనాలే ఉన్నాయి. బాలయ్య చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని భావించి మొదలెట్టారు. అలాగే కరోనా లాక్ డౌన్ కు ముందు ఈ సినిమాలోని కొన్ని కీ సీక్వెన్స్ షూటింగ్ సైతం ఫినిష్ చేసారు. ఆ తర్వాత ఆపుచేసారు. పరిస్దితిలు ఓ కొలిక్కి వచ్చాక షూటింగ్ మొదలెడదామనుకున్నారు.

Balakrishna is no mood to shoot Boyapati Srinus BB3
Author
Hyderabad, First Published Aug 15, 2020, 10:48 AM IST

బాలకృష్ణ కొన్ని విషయాల్లో చాలా నిక్కిచ్చిగా ఉంటారు. ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు. ఎవరు..ఎంత మంది వచ్చి ఏం చెప్పినా దానికి రెస్పాండ్ కారు. కాబట్టి బాలయ్యతో సినిమా అయినా మరొకటి అయినా సరిగ్గా లేకపోతే వారికి సినిమానే.అయితే ఈ విషయం తెలిసినా,గుర్తు ఉన్నా చాలా మంది ఆయన్ని టచ్ చేసి మరీ అక్షింతలు వేయించుకుంటూంటారు. రీసెంట్ గా బోయపాటి అలాగే చేసారని మీడియాలో వినపడుతోంది.

వివరాల్లోకి వెళితే... వినయ విధేయరామ చిత్రం తర్వాత బోయపాటి శ్రీను తన ఫేవెరెట్ నటుడు బాలయ్యతో కలిసి సినిమా ప్రారంభించారు. బిబి3 టైటిల్ తో వ్యవహరిస్తున్న ఈ సినిమాపై చాలా అంచనాలే ఉన్నాయి. బాలయ్య చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని భావించి మొదలెట్టారు. అలాగే కరోనా లాక్ డౌన్ కు ముందు ఈ సినిమాలోని కొన్ని కీ సీక్వెన్స్ షూటింగ్ సైతం ఫినిష్ చేసారు. ఆ తర్వాత ఆపుచేసారు. పరిస్దితిలు ఓ కొలిక్కి వచ్చాక షూటింగ్ మొదలెడదామనుకున్నారు.
 
ఈ నేపధ్యంలో అన్ని జాగ్రత్తలతో షూటింగ్ మొదలెడదామని బోయపాటి,నిర్మాత ప్లాన్ చేసుకున్నారట. అందులోనూ అఘోరా గెటప్ లో తీసే సీన్స్...అడవిలో కాబట్టి కరోనా సమస్య ఉండదని భావించి ఆ నిర్ణయం తీసుకున్నారట. ఈ విషయం బాలయ్యకు చెప్తే...మొదట ఏదైతే కరోనా తగ్గి లేదా వాక్సిన్ వచ్చాకే షూటింగ్ అన్న మాట మీదే ఉన్నారట. వాక్సిన్ వచ్చాక షూటింగ్ ప్రారంభిద్దామని బాలయ్య చెప్పారట.  మరో ప్రక్క బాలయ్య ఈ కరోనా టైమ్ లోనూ సామాజిక కార్యక్రమాలు కంటిన్యూ చేస్తున్నారు. అలాంటప్పుడు షూటింగ్ ప్రారంబించవచ్చు కదా అని టీమ్ లాజిక్. కానీ బాలయ్య మాత్రం ఒప్పుకోవటం లేదట. 

Follow Us:
Download App:
  • android
  • ios