బిగ్ బాస్ హోటల్ లో గెస్ట్ లుగా ఉన్న సోహైల్ కి సర్వ్ చేసిన ఫుడ్ శుభ్రంగా లేదు.  హోటల్ సర్వెంట్స్ గా అవినాష్ ఎవరికీ తెలియకుండా ఫుడ్ లో పిన్ వేశాడు. బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ లో భాగంగా అలా చేయడం జరిగింది. ఐతే ఫుడ్ ప్లేట్ లో మొదట ఒక వెంట్రుకను చూసిన సోహైల్, ఆ తరువాత పిన్ చూసి మరింత ఇరిటేట్ అయ్యారు. 

స్టార్ హోటల్ లో కూడా ఫుడ్ ఇంత ఛండాలంగా ఉంటుందా అన్నారు. ఆ ఫుడ్ వండిన లాస్య, అవినాష్ లపై సోహైల్ విరుచుకుపడ్డాడు.   వాళ్ళ కోసం మనం ఇంత చేస్తుంటే వాళ్ళు కావాలని అల్లరి పెడుతున్నారని రాజశేఖర్ బాధపడ్డారు. 

ఇక టిప్స్ కోసం రాజశేఖర్, అభిజిత్, అఖిల్ చేసిన టాస్క్ లు వారికి చుక్కలు చూపించాయి. స్విమ్మింగ్ పూల్ దిగుతూ ఎక్కుతూ రాజశేఖర్ మాస్టర్ అల్లాడిపోయారు. వరుసగా 75 పుష్ అప్స్ చేసిన అఖిల్ ఇక చేయలేక పడుకున్నారు. ఇక అభిజిత్ వెయిట్ లిఫ్టింగ్ టాస్క్ లో చెమటలు కక్కించారు. 

కష్టపడినా కూడా వేయి చొప్పున ఈ ముగ్గురు టిప్స్ అందుకున్నారు. సీక్రెట్ టాస్క్ లో అవినాష్ క్యారెక్టర్ వారియేషన్ బాగుంది. మెహబూబ్ మాత్రం ధనవంతుల పాత్రలో మెహబూబ్ రుబాబు బాగా ఎక్కువైంది.