Asianet News TeluguAsianet News Telugu

'కుబేర'లో కింగ్ నాగార్జున ఫస్ట్ లుక్ టీజర్.. కూల్ అండ్ ఇంటెన్స్, బిజియంతో అదరగొట్టేసిన దేవిశ్రీ 

ట్యాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ కుబేర. కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఇది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ తోనే అంచనాలు పెరిగిపోయాయి. కుబేర అని టైటిల్ పెట్టి ధనుష్ ని బిచ్చగాడి గెటప్ లో శేఖర్ కమ్ముల చూపించారు. 

King Nagarjun first look from Kubera movie out now dtr
Author
First Published May 2, 2024, 7:45 PM IST

ట్యాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ కుబేర. కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఇది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ తోనే అంచనాలు పెరిగిపోయాయి. కుబేర అని టైటిల్ పెట్టి ధనుష్ ని బిచ్చగాడి గెటప్ లో శేఖర్ కమ్ముల చూపించారు. శేఖర్ కమ్ముల వైవిధ్యంగా బలమైన కథతో ఏదో చేయబోతున్నారు అని అర్థం అయింది. 

ఈ చిత్రంలో కింగ్ నాగార్జున అత్యంత కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నాగార్జున ఫస్ట్ లుక్ టీజర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. నాగార్జున బ్లూ షర్ట్ ధరించి, కళ్ళజోడు పెట్టుకుని కూల్ లుక్ లో కనిపిస్తున్నాడు. చూస్తుంటే  నాగార్జున రిచ్ గా అసలైన కుబేరుడిగా కనిపిస్తున్నారు. అయితే టీజర్ ని బట్టి అంచనాకి రాలేం. 

వర్షం పడుతుండగా గొడుగు పట్టుకుని నాగ్.. డబ్బు కట్టలు ఉన్న భారీ కంటైనర్ దగ్గర ఉన్నారు. కంటైనర్ నుంచి తిరిగి వస్తుండగా కింద 500 నోటు వర్షంలో తడిచి పాడైపోయి ఉంటుంది. దీనితో నాగ్ తన జేబు లో నుంచి ఒక 500 నోటు తీసి ఆ కంటైనర్ లో కలిపేస్తాడు. 

 

ఇదంతా ఒకెత్తయితే టీజర్ కి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బిజియం మరో ఎత్తు. నాగార్జున కూల్ లుక్స్ కి ఇంటెన్సిటీ పెంచేలా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఉంది. మొత్తంగా నాగార్జున టీజర్ తో కుబేర చిత్రంపై శేఖర్ కమ్ముల ఆడియన్స్ కి కొత్త ఫజిల్ వదిలారు. ధనుష్ ఏమో బిచ్చగాడి గెటప్ లో కనిపిస్తున్నాడు. నాగార్జున ఏమో నోట్ల కట్టలతో ఉన్నాడు. అసలు వీరిద్దరి మధ్య కనెక్షన్ ఏంటి ? ఎవరు అసలైన కుబేరుడు ? లాంటి ప్రశ్నలు తలెత్తడం ఖాయం. 

Follow Us:
Download App:
  • android
  • ios