Asianet News TeluguAsianet News Telugu

రెడ్‌బస్: బన్నీ నుంచి ధోనికి!

ఈ మధ్య కమర్షియల్ యాడ్స్ తో బాగా పాపులర్ అయి  సౌత్ స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఒకరు. మంచి ఆదాయాన్ని అందించే ఈ దారిలో చాలా మంది సెలబ్రెటీలు అడుగులు వేస్తున్నారు. ఇక రీసెంట్ గా బన్నీ చేస్తున్న ఒక యాడ్ ను ధోని లాగేసుకున్నాడు. 

allu arjun out frome redbus ad
Author
Hyderabad, First Published Apr 18, 2019, 12:00 PM IST

ఈ మధ్య కమర్షియల్ యాడ్స్ తో బాగా పాపులర్ అయి  సౌత్ స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఒకరు. మంచి ఆదాయాన్ని అందించే ఈ దారిలో చాలా మంది సెలబ్రెటీలు అడుగులు వేస్తున్నారు. ఇక రీసెంట్ గా బన్నీ చేస్తున్న ఒక యాడ్ ను ధోని లాగేసుకున్నాడు. 

బస్ టికెట్స్ బుకింగ్ ప్లాట్‌ఫాం రెడ్ బస్ గురించి అందరికి తెలిసిందే. గత కొంత కాలంగా నేషనల్ వైడ్ గా ఈ సంస్థకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రచారకర్తగా కొనసాగుతున్నాడు. అయితే ఇప్పుడు భారత సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని రెడ్ బస్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేశాడు. ధోని ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. బల్బీర్ సింగ్ అనే పాత్రలో ధోని యాడ్స్ లో కనిపించనున్నాడు.  

సంస్థ ప్రతినిధులు ఈ విషయాన్నీ అధికారికంగా తెలియజేశారు. ధోని లాంటి గొప్ప క్రికెటర్ తమ సంస్థతో కలవడం చాలా ఆనందంగా ఉందని, ఇక దేశ వ్యాప్తంగా ధోని ద్వారానే అన్ని ప్రచారాలను కొనసాగిస్తామని అన్నారు. అదే విధంగా ధోని యాడ్స్ వల్ల జనాలకు రెడ్ బస్ చాలా తొందరగా చేరువవుతుందని తెలియజేశారు.   

Follow Us:
Download App:
  • android
  • ios