ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి డైరక్షన్ లో రూపొందుతున్న తాజా చిత్రం ‘మహర్షి’.మహేష్ బాబు‌, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా  రామోజీ ఫిల్మ్‌సిటీలో మొదలైన షెడ్యూల్‌  నడుస్తోంది. ప్రస్తుతం అక్కడ మహేష్, అల్లరి నరేశ్‌ మధ్య కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం...‘అల్లరి నరేష్ .. మహేష్  ఫ్రెండ్ ‘రవి’పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర సెకండాఫ్ లో వస్తుందని సినిమాకు హైలెట్ అవుతుందని సమాచారం.

పల్లెలో కలిసే రవి పాత్ర..సినిమాకు ఊపు ఇస్తుందని, కేవలం నరేష్ లో కామెడీ యాంగిల్ మాత్రమే కాకుండా ఓ మంచి నటుడు గా ఉన్నాడని ఆ సీన్స్   ప్రూవ్ చేస్తాయని చెప్తున్నారు. ఇక ఈ పాత్ర  పల్లెటూళ్లలో రెగ్యులర్ గా కనిపించే పనిపాటా లేకుండా వీధిల్లో కూర్చుని కబుర్లు చెప్పే క్యారక్టర్ అని వినికిడి.  మొదట నరేష్  తమ విలేజ్ కు వ్యవసాయం చేయటానికి వచ్చిన మహేష్ ని విభేధించినా తర్వాత సపోర్ట్ గా నిలుస్తుందని అంటున్నారు.

అల్లరి నరేష్ మాట్లాడుతూ.. అసలు మొదట  ... విలన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను. కానీ రవిబాబు నన్ను కామెడీ హీరోగా మార్చారని చెప్పుకొచ్చాడు. దీంతో తాను మహర్షి సినిమాకు ముందు వరకూ ఆ కామెడీ హీరోగానే కంటిన్యూ అయ్యిపోయానని అన్నారు. కానీ మహర్షి సినిమా  తన యాక్టింగ్ కెరీర్‌నే మార్చివేస్తుందని...   కామెడీ హీరోననే ముద్రను చెరిపివేస్తుందని అల్లరి నరేష్ తెలిపాడు.

అలాగే ఈ సినిమాలో మహేష్ బాబు కాలేజ్‌ స్టూడెంట్‌గా, బిజినెస్‌ మేన్‌గా కనిపిస్తారని ఇప్పటికే  తెలిసిందే. అయితే మోడ్రన్‌ రైతుగానూ ఈ చిత్రంలో కనిపిస్తారని సమాచారం. మూడు దశల్లో నడిచే ఈ కథలో మూడు డిఫరెంట్‌ షేడ్స్‌లో కనిపిస్తారని చెప్తున్నారు. ఆల్రెడీ డెహ్రాడూన్‌లో స్టూడెంట్‌గా, యూఎస్‌లో బిజినెస్‌మేన్‌గా ఉన్న సన్నివేశాల షూటింగ్‌ను పూర్తి చేశారు. ప్రస్తుతం ఓ స్టూడియోలో వేసిన విలేజ్ సెట్లో షూటింగ్‌ జరుపుకుంటోంది ‘మహర్షి’.

అశ్వనీదత్, ‘దిల్‌’ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌.  వచ్చే ఏడాది ఉగాది స్పెషల్‌గా ఏప్రిల్‌ 5న రిలీజ్‌ కానున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: కేయూ మోహనన్‌.  

 

ఇవి కూడా చదవండి.. 

ఈగోలతో మహేష్ సినిమాకి ఇబ్బందులు!

మహేష్ సినిమా కంట్రోల్ దాటుతోందా..?

'మహర్షి' లో సాయికుమార్, 'అతడు' ని గుర్తు చేసేలా...?

'మహర్షి' సినిమాతో రిస్క్ లో పడతారా..?

మహేష్ సినిమాలో బాలయ్య హీరోయిన్!

మహేష్ ‘మహర్షి’ కథ ఇదేనా?

మహేష్ బాబు ఐదు గెటప్పుల్లో..!

'మహర్షి' షూటింగ్ లో హాట్ బ్యూటీ మిస్!

టాక్ ఆఫ్ ది టౌన్: అల్లరి నరేష్, మహేష్ ఫ్రెండ్షిప్... సీక్రెట్ ఇదే

మహేష్.. దిల్ రాజు మాట వినడం లేదా..?

మహర్షి: మహేష్ లుక్ మాములుగా లేదు.. చంపేసాడు!

తప్పులో కాలేసిన హీరో మహేష్ బాబు

మహర్షి శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ ఛానెల్!

మహేష్ నిజంగానే మోసం చేస్తున్నాడు?