సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. నిజానికి ఈ సినిమాకి దిల్ రాజు మాత్రమే నిర్మాతగా వ్యవహరించాలి కానీ మహేష్ బాబు నిర్మాత అశ్వనీదత్ ని కూడా భాగం చేశారు.

మరోపక్క నిర్మాత పీవీపీ.. వంశీ పైడిపల్లి తన బ్యానర్ లో సినిమా చేస్తానని కమిట్ అయి మరో బ్యానర్ కి ఎలా చేస్తాడని కేసు పెట్టాడు. దీంతో ఈ ప్రాజెక్ట్ లో ఆయన్ను కూడా భాగస్వామిని చేయాల్సి వచ్చింది.

ఒక ప్రాజెక్ట్ కి ముగ్గురు నిర్మాతలు కావడంతో ఒకరితో మరొకరికి ఈగో సమస్యలు వస్తున్నట్లు సమాచారం. దిల్ రాజు ఎక్కువగా తన అథారిటీ చూపించడం మిగిలిన ఇద్దరు నిర్మాతలకు నచ్చడం లేదట. మంచి డీల్స్ ఏమైనా వస్తే బిజినెస్ క్లోజ్ చేయాలని దిల్ రాజు చూస్తుంటే తమ మధ్య ఉన్న ఈగో సమస్యలతో ఆ డీల్ క్లోజ్ అవ్వకుండా చూస్తున్నారట మిగిలిన ఇద్దరు.

ఈ విషయంపై దిల్ రాజు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా.. వారు మాత్రం వినడం లేదట. మరోపక్క సినిమా బడ్జెట్ కూడా పెరిగిపోతుందని టాక్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇవి కూడా చదవండి.. 

మహేష్ సినిమా కంట్రోల్ దాటుతోందా..?

'మహర్షి' లో సాయికుమార్, 'అతడు' ని గుర్తు చేసేలా...?

'మహర్షి' సినిమాతో రిస్క్ లో పడతారా..?

మహేష్ సినిమాలో బాలయ్య హీరోయిన్!

మహేష్ ‘మహర్షి’ కథ ఇదేనా?

మహేష్ బాబు ఐదు గెటప్పుల్లో..!

'మహర్షి' షూటింగ్ లో హాట్ బ్యూటీ మిస్!

టాక్ ఆఫ్ ది టౌన్: అల్లరి నరేష్, మహేష్ ఫ్రెండ్షిప్... సీక్రెట్ ఇదే

మహేష్.. దిల్ రాజు మాట వినడం లేదా..?

మహర్షి: మహేష్ లుక్ మాములుగా లేదు.. చంపేసాడు!

తప్పులో కాలేసిన హీరో మహేష్ బాబు

మహర్షి శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ ఛానెల్!

మహేష్ నిజంగానే మోసం చేస్తున్నాడు?