MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • OTT Releases: ఈ వారం ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఇవే.. తెలుగు ఆడియెన్స్ కి పండగే

OTT Releases: ఈ వారం ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఇవే.. తెలుగు ఆడియెన్స్ కి పండగే

OTT Releases: ఈ వారం(మార్చి 9-15) వరకు ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఏంటో చూస్తే, తెలుగు ఆడియెన్స్ కి మంచి స్టఫ్‌ రాబోతుంది. సినిమాలు, సిరీస్‌లు సందడి చేయబోతున్నాయి. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Mar 09 2026, 08:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఈ వారం(మార్చి 9 15) ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు, సిరీస్‌లు
Image Credit : Asianet News

ఈ వారం(మార్చి 9-15) ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు, సిరీస్‌లు

ఇప్పుడు థియేటర్లలో ఏ సినిమా రిలీజ్‌ అవుతుందనే ఆసక్తికంటే ఓటీటీలో ఏ ఏ సినిమాలు వస్తున్నాయి. ఏ వెబ్‌ సిరీస్‌లు వస్తున్నాయనే ఆసక్తినే ఆడియెన్స్ లో ఎక్కువగా ఉంది. ఇంట్లో కూర్చొని హాయిగా చూడొచ్చు అనే ఫీలింగ్‌ ఏర్పడింది. మరి ఈ వారం ఓటీటీలోకి వస్తోన్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఏంటనేది చూస్తే, తెలుగు ఆడియెన్స్ పండగ చేసుకునే సినిమాలు రాబోతున్నాయి. రవితేజ, విశ్వక్‌ సేన్‌ మూవీస్‌ ఈ వారమే ఓటీటీలోకి వస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
మార్చి 13న రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి
Image Credit : X/@DirKishoreOffl

మార్చి 13న రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి

ఈ వారం ఓటీటీలోకి  మాస్‌ మహారాజా రవితేజ నటించిన `భర్త మహాశయులకు విజ్ఞప్తి` చిత్రం రాబోతుంది. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రవితేజకి జోడీగా ఆషికా రంగనాథ్‌, డింపుల్‌ హయతి నటించారు. రొమాంటిక్‌ ఫ్యామిలీ డ్రామాగా, కామెడీ ప్రధానంగా ఈ చిత్రం రూపొందింది. సంక్రాంతి కానుకగా విడుదలై నిరాశ పరిచింది. ఇప్పుడు దాదాపు రెండు నెలల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది. ఈ నెల 13న జీ 5లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మూవీకి చాలా లేట్‌గా ఓటీటీ డీల్‌ సెట్‌ అయ్యింది. అందుకే లేట్‌గా ఓటీటీలోకి వస్తోంది.

37
మార్చి 13నే ఫంకీ
Image Credit : X/@SitharaEnts

మార్చి 13నే ఫంకీ

ఈ వారమే రాబోతున్న మరో తెలుగు సినిమా `ఫంకీ`. ఇది ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 13న విడుదలైంది. అనుదీప్‌ దర్శకత్వంలో విశ్వక్‌ సేన్‌, కయాదు లోహర్‌ జంటగా నటించారు. కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. మార్చి 13నే నెట్‌ ఫ్లిక్స్ లో ఇది స్ట్రీమింగ్‌ కానుంది. అనుదీప్‌ లవర్స్ కి పండగే అని చెప్పొచ్చు.

47
మార్చి 12న నవాబ్‌ కేఫ్‌
Image Credit : Asianet News

మార్చి 12న నవాబ్‌ కేఫ్‌

మార్చి 12న `నవాబ్‌ కేఫ్‌` మూవీ రిలీజ్‌ కాబోతుంది. శివ కందుకూరి, తేజు అశ్విని జంటగా రాజీవ్‌ కనకాల ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఫ్యామిలీ, ఎమోషనల్‌ డ్రామాగా రూపొందింది. వారసత్వంగా వచ్చిన ఛాయ్‌ గొప్పతనాన్ని తెలియజేస్తూ రూపొందిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్‌ చేసింది. ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఈటీవీ విన్‌ లో ఈ నెల 12న స్ట్రీమింగ్‌ కానుంది.

57
మ్యాడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ రియాలిటీ షో
Image Credit : Youtube/@Starmaa

మ్యాడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ రియాలిటీ షో

ఇక ఈ వారమే ఓటీటీలో ఒక టీవీ షో కూడా స్టార్ట్ కాబోతుంది. జీయో హాట్‌ స్టార్‌లో `మ్యాడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌` అనే కొత్త షో ప్రారంభం కానుంది. పది జంటలు, పది వారాలు ఒకే ఇంట్లో ఉంటారు. వీరంతా లవర్స్. ఈ పది వారాలు తమ రిలేషన్‌ ఎంత బలంగా, నమ్మకంగా, ప్రేమతో ఉందని, కష్టాల్లోనూ ప్రేమ కోసం ఎలా నిలబడతారని తెలియజేసేలా సాగబోతుంది. అనిల్‌ రావిపూడి, రాధ, లయ జడ్జ్ లుగా వ్వవహరిస్తున్న ఈ షో ఈ నెల 15 నుంచి జీయో హాట్‌ స్టార్లో స్ట్రీమింగ్‌ కానుంది.

67
ఓటీటీలో ఈ వారం రాబోతున్న సినిమాలు
Image Credit : Poster

ఓటీటీలో ఈ వారం రాబోతున్న సినిమాలు

పైన రాబోతున్న తెలుగు చిత్రాలతో, షోతోపాటు ఇతర భాషల చిత్రాలు, సిరీస్‌లు కూడా ఈ వారం రాబోతున్నాయి. అవేంటో చూస్తే, ప్రేమికుల రోజు సందర్భంగా తమిళంలో విడుదలైన `పూకీ` అనే చిత్రం ఇప్పుడు మార్చి 13 నుంచి జీ 5లో స్ట్రీమింగ్‌ కానుంది. ఇందులో అజయ్‌ దిశన్‌, ఆర్కే ధనుష జంటగా నటించారు. ఇది థియేటర్లో ఆడలేదు. ఇప్పుడు ఓటీటీలో ఆకట్టుకుంటుందా అనేది చూడాలి. దీంతోపాటు ప్రియాంక అరుల్‌ మోహన్‌ నటించిన `మేడ్‌ ఇన్‌ కొరియా`. విలేజ్‌ కామెడీ డ్రామాగా సాగే ఈ మూవీ మార్చి 12 నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ కానుంది. దీనికి రా కార్తీక్‌ దర్శకత్వం వహించారు. దునియా విజయ్‌ నటించిన కన్నడ మూవీ `ల్యాండ్‌లార్డ్` కూడా ఈ వారమే వస్తోంది. జీ 5లో మార్చి 13 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. పీరియడ్‌ యాక్షన్‌ డ్రామాగా ఇది రూపొందింది. మరో తమిళ చిత్రం `నాంగల్‌` మార్చి 13న సన్‌ నెక్ట్స్ లో స్ట్రీమింగ్‌ కానుంది. దీనికి అవినాష్‌ ప్రకాష్‌ దర్శకత్వం వహించారు. గుజరాతీ మూవీ `నాంఖతై` అనే మూవీ మార్చి 12న షేమరో మీ అనే ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. `ది తాజ్‌ స్టోరీ` అనే హిందీ ఫిల్మ్ మార్చి 13న లయన్స్ గేట్‌ ప్లే లో స్ట్రీమింగ్‌ కానుండగా, `ది మేడిసన్‌` అనే ఇంగ్లీష్‌ ఫిల్మ్ మార్చి 15న జియో హాట్‌ స్టార్‌లో, `ది ఫ్యామిలీ మెక్‌ ములెన్‌` అనే ఇంగ్లీష్‌ మూవీ మార్చి 15న జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది.

77
వెబ్‌ సిరీస్‌లు
Image Credit : prime video

వెబ్‌ సిరీస్‌లు

జీ 5 

ఆంధ్ర ప్యార్‌ 2.0(హిందీ) -మార్చి 14

ప్రైమ్‌ వీడియోస్‌

ఆస్పిరెంట్‌ సీజన్‌ 3(హిందీ)- మార్చి 13

సంకల్ప్(హిందీ)-మార్చి 11(అమెజాన్‌ ఎంఎక్స్ ప్లేయర్‌)

స్కార్పెట్టా(ఇంగ్లీష్‌)-మార్చి 11

నెట్‌ ఫ్లిక్స్

హ్యారీ స్టైల్స్, వన్ నైట్‌ ఇన్‌ మాంచెస్టర్‌(ఇంగ్లీష్‌)-మార్చి 9

వన్‌ పీస్‌ సీజన్‌ 2(ఇంగ్లీష్‌)-మార్చి 10

వర్జిన్‌ రివర్‌ సీజన్‌ 7(ఇంగ్లీష్‌)-మార్చి 12

ఫాటల్‌ సెడక్షన్‌ సీజన్‌ 3(ఇంగ్లీష్‌)-మార్చి 13

దట్‌ నైట్‌(స్పానిష్‌)-మార్చి 13

ఏజ్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌(ఇంగ్లీష్‌)-మార్చి 11

జియో హాట్‌స్టార్‌

రీసార్ట్ (తమిళం)-మార్చి 13

రూస్టర్‌(ఇంగ్లీష్‌)-మార్చి 9

ది సోసైటీ సీజన్‌ 2(హిందీ)-మార్చి 9(రియాలిటీ షో)

జూటోపియా 2(ఇంగ్లీష్‌)-మార్చి 13

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఓటీటీ
బాలీవుడ్
తమిళ సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Related Stories
Recommended image1
Shanmukh Jaswanth: లవ్‌ మీద హోప్స్ పోయాయి, ఘోరంగా ఏడ్చేశా.. బ్రేకప్‌పై ఫస్ట్ టైమ్‌ రియాక్ట్ అయిన షణ్ముఖ్‌ జస్వంత్‌
Recommended image2
Rashmi Gautam: యాంకర్‌ రష్మి మొదటి సంపాదన ఎంతో తెలుసా? ఆమె క్రియేటివిటీకి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved