కర్నాటక డ్రగ్‌ కేసులో నటి సంజనా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆమెతోపాటు మరో నటి రాగిణి ద్వివేదిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే సంజన బెయిల్‌ పిటిషన్లని కోర్ట్ కొట్టివేస్తుంది. ఎన్‌డీపీఎస్‌ ప్రత్యేక కోర్ట్ సంజన్‌ పెట్టుకున్న ఆర్జీని రెండుసార్లు తిరస్కరించింది.

ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి సంజన కోర్ట్ ని ఆశ్రయించింది. బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ కర్నాటక హైకోర్ట్ లో పిటిషన్‌ దాఖలు చేశారు. `సంజనపై సీసీబీ, నార్కోటిక్‌ విభాగం అధికారులు చేసి ఆరోపణల్లో ఎలాంటి ఆధారాలు లేవు. ఆమె పేరు ఇప్పటికీ ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయలేదు` అని ఈ సందర్భంగా సంజనా తరఫున న్యాయవాది కోర్ట్ కి విన్నవించారు. 

ఇందులో సీసీబీ, కాటన్‌ పేట పోలీస్‌ స్టేషన్‌ పోలీసులను ప్రతివాదులుగా చేర్చారు. ధర్మాసనం పీఠం ముందుకు ఆర్జీ విచారణకు రానుంది. సంజనాని ఈ నెల 23 వరకు విచారణ నిమిత్తం రిమాండ్‌కి తరలించిన విషయం తెలిసిందే.