Asianet News TeluguAsianet News Telugu

`కల్కి2898ఏడీ`కి డిజాస్టర్‌ రిపోర్ట్.. వివాదాస్పద క్రిటిక్‌ షాకింగ్‌ పోస్ట్.. డార్లింగ్‌ ఫ్యాన్స్ ఏం చేశారంటే?

ప్రభాస్‌ నటిస్తున్న `కల్కి 2898ఏడీ` చిత్రం కోసం అంతా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. అయితే ఓ కాంట్రవర్సియల్‌ క్రిటిక్‌ మాత్రం షాకింగ్‌ పోస్ట్ పెట్టాడు. అది పెద్ద రచ్చ అవుతుంది. 
 

kalki 2898 ad big Disaster controversial critic shocking post arj
Author
First Published May 4, 2024, 10:44 AM IST

ప్రభాస్‌ నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ `కల్కి2898ఏడీ`. నాగ్‌ అశ్విన్ రూపొందిస్తున్న ఈ మూవీ వచ్చే నెలలో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ నెల 9న రావాల్సిన ఈ మూవీ వాయిదా పడిన విసయం తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ కంప్లీట్‌ కాకపోవడం, ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేసినట్టు సమాచారం. 

ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఇప్పటి వరకు విడుదలైన లుక్స్, గ్లింప్స్ ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేసేలా ఉన్నాయి. అయితే ఆకట్టుకునేలా లేకపోయినా, నాగ్‌ అశ్విన్‌ ఏదో చెప్పబోతున్నాడనే ఆతృతలో అందరిలోనూ ఉంది. సైన్స్ ఫిక్షన్‌కి మైథలాజికల్‌ అంశాలను జోడించి ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు నాగ్‌ అశ్విన్‌. అయితే రెండింటిని ఎలా సింక్‌ చేస్తారనేది పెద్ద ప్రశ్న. ఇదే ఈ సినిమాపై ఆసక్తిని పెంచే అంశం.

చాలా కాంప్లికేటెడ్‌ స్క్రిప్ట్ అనే చెప్పాలి. ఆడియెన్స్ కి అర్థమయ్యేలా చెప్పాలంటే పెద్ద టాస్కే. దర్శకుడు ఎలా కన్విన్స్ చేస్తారనేది పెద్ద డౌట్. అదే ఈ మూవీపై ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేసే అంశం. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో భారీ కాస్టింగ్‌ ఉంది. ప్రభాస్‌తోపాటు కమల్‌ హాసన్‌(గెస్ట్ రోల్‌), అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనె, దిశా పటానీ, అలాగే గెస్ట్ లుగా రానా, నాని, విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌ నటిస్తున్నారు. ఇది కూడా సినిమాపై అంచనాలు ఏర్పడ్డానికి కారణమైంది. 

ఇదిలా ఉంటే ఈ మూవీపై కాంట్రవర్షియల్‌ క్రిటిక్ ఉమైర్‌ సందు షాకింగ్‌ కామెంట్స్ చేశారు. సోషల్‌ మీడియా ద్వారా సంచలన పోస్ట్ పెట్టాడు. సినిమాకి డిజాస్టర్‌ టాక్‌ వచ్చిందంటున్నాడు. టీమ్‌ ఫస్ట్ కాపీ చూసుకున్నప్పుడు ఔట్‌పుట్‌ చెత్తగా ఉందని భావించారట. సినిమాపై హోప్స్ వదులుకున్నట్టుగా ఉమైర్‌ సందు ట్వీట్‌(ఎక్స్) చేశాడు. ఇదిప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

సాధారణంగా ఉమైర్ సందు ఇలాంటి షాకింగ్‌ పోస్ట్ లతో వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తుంటారు. హీరోహీరోయిన్ల మధ్య ఎఫైర్ రూమర్స్ క్రియేట్‌ చేస్తాడు. అలాగే విడాకులు తీసుకోబోతున్నారంటూ కామెంట్లు చేస్తుంటాడు. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను టార్గెట్‌ చేస్తూ పోస్ట్ లు పెట్టి హాట్‌ టాపిక్‌ అవుతుంటాడు. అంతేకాదు ఓవర్సీస్‌ సెన్సార్‌ బోర్డ్ మెంబర్‌గా చెప్పుకుని గతంలో మరింత పాపులర్‌ అయ్యాడు. ఆ మధ్య ఇలాంటి పోస్ట్ లు తగ్గించిన ఆయన ఇప్పుడు మళ్లీ రెచ్చిపోతుండటం గమనార్హం. 

ఇక తాజాగా ప్రభాస్‌ `కల్కి2898ఏడీ`పై ఆయన పెట్టిన ఈ పోస్ట్ పై నెటిజన్లు స్పందిస్తూ ఆడుకుంటున్నారు. బూతు పదాలు వాడుతూ కౌంటర్లు వేస్తున్నారు. ట్రోల్‌ చేస్తున్నారు. అయితే దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ పెద్దగా రియాక్ట్ కావడం లేదు. ఓ రకంగా పట్టించుకోవడం లేదు.ఆయన చేసే చెత్త పోస్ట్ లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని వాళ్లు భావిస్తూ సైలెంట్‌గా ఉంటున్నారు. ఆయన పోస్ట్ కి రియాక్ట్ అయితే అనవసరంగా అతన్ని పాపులర్‌ చేసినట్టు అవుతుందని భావించి లైట్‌ తీసుకుంటుండటం విశేషం. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios