Asianet News TeluguAsianet News Telugu

ఆషు రెడ్డి బాడీ సూపర్‌ డీలక్స్ లా ఉంటుందట.. బోల్డ్ రోల్‌లో షాకివ్వబోతున్న జూ.సమంత

బిగ్‌ బాస్‌ నటి ఆషు రెడ్డి సోసల్‌ మీడియాలో సెన్సేషన్‌గా మారుతుంది. అయితే ఇప్పుడు వెండితెరపై కూడా హాట్‌ టాపిక్ అయ్యింది. ఆమె లుక్‌ షాకిస్తుంది. 
 

ashu reddy bold role revealed from the  yevam movie arj
Author
First Published May 3, 2024, 10:41 PM IST

బిగ్‌ బాస్‌ బ్యూటీ ఆషు రెడ్డి చూడ్డానికి సమంతలా ఉంటుందని అంతా ఆమెని జూ సమంతా అనిపిలుస్తుంటారు. ఇప్పటికే సోషల్‌ మీడియాలో గ్లామర్‌ డోస్‌ పెంచుతూ షాకిస్తుంది. శృతి మించిన అందాల విందుతో మతిపోగొడుతుంది. ఇదే ఆమెకి పెద్ద అసెట్‌ అని చెప్పొచ్చు. తన గ్లామర్‌ షోతో సామాజిక మాధ్యమాలను షేక్‌ చేసే ఈ బ్యూటీ దాని కారణంగానే సినిమా ఆఫర్లని అందుకుంటుంది. నెమ్మదిగా నటిగాజోరు పెంచుతుంది. ప్రస్తుతం ఆమె ఓ బోల్డ్ రోల్‌లో కనిపించబోతుంది. 

ఆషు రెడ్డి ప్రస్తుతం `యేవమ్‌` అనే చిత్రంలో నటిస్తుంది. ఇందులో ఆమెది చాలా బోల్డ్ రోల్‌ అట. టీమ్‌ తాజాగా ఈ విషయాన్ని ప్రకటించింది. అంతేకాదు `నా బాడీ సూపర్‌ డీలక్స్` అంటూ ఓ హాట్‌ ఫోటోని పంచుకున్నారు. ఇందులో ఆషు రెడ్డి తన బాడీని సూపర్‌ డీలక్స్ గా భావిస్తుందట. అలానే ఫీలవుతుందట. అలాంటి పాత్రలో కనిపించబోతుందట. మరి ఆమె ఎందుకు సూపర్‌ డీలక్స్ అని చెప్పింది, ఆ పాత్రలో ఉన్న మర్మమేమిటి అనేది మాత్రం సస్పెన్స్ లో పెట్టారు. 

చాందిని చౌదరి, వశిష్ట సింహా, జై భారత్‌, ఆషు రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రకాష్‌ దంతులూరి దర్శకుడు. నవదీప్‌, పవన్‌ గోపరాజు నిర్మించారు. శుక్రవారం ఈ చిత్రం నుంచి ఆషు రెడ్డి లుక్‌ని పరిచయం చేశారు. ఇందులో ఆమె హారిక అనే పాత్రలో చాలా బోల్డ్ గా కనిపిస్తుంది. చాలా హాట్ గా ఉంది. కుర్రాళ్లకి మతిపోయేలా ఆషు రెడ్డి పోజు ఉండటం విశేషం. ఈ పిక్స్ వైరల్ అవుతుంది. అయితే చూడబోతుంటే ఇందులో ఆషు రెడ్డి వ్యాంపు తరహా పాత్రలో కనిపించబోతుందని తెలుస్తుంది. అదే సమయంలో హర్రర్‌ ఎలిమెంట్లు ఉంటాయని అంటున్నారు. మరి ఆమె పాత్ర ఎలా ఉంటుందో సినిమాలోనే చూడాలి. 

మహిళా సాధికారికతను చాటి చెప్పే నేప‌థ్యంలో ఈ సినిమా ఉంటుందని, ఇటీవ‌ల విడుద‌ల చేసిన చాందిని చౌద‌రి పోస్ట‌ర్‌లో వున్న 'ఆడపిల్లని అయితే ఏంటంటా? అనే రైట‌ప్ అంద‌ర్ని ఆలోచింప‌జేసింది. ఇప్పుడు ఆషు రెడ్డి నా బాడీ సూప‌ర్ డీల‌క్స్ అని ఎందుకు అంటుంది. ఇలా ప్ర‌తి పాత్ర‌కు ఒక మార్క్ వుంటుంది. కొత్త కంటెంట్‌తో పాటు ఎంతో డిఫరెంట్‌ నేరేషన్‌తో ఈ సినిమా వుంటుంది. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం  ఉందని టీమ్‌ తెలిపింది. 

గోపరాజు రమణ, దేవిప్రసాద్‌, కల్పిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ః  ఎస్‌వీ విశ్వేశ్వర్‌, సంగీతం కీర్తన శేషు, నీలేష్‌ మందలపు అందిస్తున్నారు. సుజనా అడుసుమిల్లి ఎడిటర్‌గా, రాజు పెన్మెత్స ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఆషు రెడ్డి `ది మాస్టర్ పీల్‌` అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది విడుదలకు రెడీ అవుతుంది.
 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios