Asianet News TeluguAsianet News Telugu

Netflix లో టాప్ ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ లిస్ట్, తెలుగు నుంచి ఆ సినిమానే?

 మే నెల తొలి వీకెండ్ లో నెట్‌ఫ్లిక్స్ తన ఓటీటీ ప్లాట్‌ఫామ్ పై ఉన్న ట్రెండింగ్ మూవీస్ లిస్ట్ విడుదల చేసింది.  ట్రెండింగ్ మూవీస్ లో..

Netflix May 2024 first weekend Top Trending Movies Web Series jsp
Author
First Published May 4, 2024, 10:03 AM IST

ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ డిజిటల్ స్ట్రీమింగ్ లో  నెట్ ఫ్లిక్స్ హవా నడుస్తోంది.  ఇండియాలో కొంచెం ముందు వెనక ఉన్నా ఇక్కడ కూడా పాతుకుపోయేందుకు ప్రయత్నిస్తోంది. మన జనం ఎక్కువగా ఆసక్తి చూపించే సినిమా ఎంటర్టైన్ మెంట్ లో నెట్ ఫ్లిక్స్ టాప్ లో ఉండటం గమనించవచ్చు. ముఖ్యంగా స్టార్ హీరోల చిత్రాల డిజిటల్ రైట్స్ కోసం కోట్ల రూపాయిలు పెట్టు బడులు పెడుతోంది. ఇతర స్ట్రీమింగ్ చానల్స్ తో పోటీ పడుతూ వారికంటే ఎక్కువ ధరని నిర్మాతలకి ఆఫర్ చేస్తూ డిజిటల్ హక్కులు దక్కించుకుంటోంది. టాలీవుడ్ లో టైర్ 1, టైర్ 2  హీరోల సినిమాలు మొత్తం నెట్ ప్లిక్స్  చేతికి వెళ్తున్నాయి. ఈ ఏడాదిలో రిలీజ్ కాబోయే సినిమాలకి సంబందించిన డిజిటల్ రైట్స్ ని ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.  ఈ క్రమంలో ఈ నెలలో ప్రస్తుతం టాప్ ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ లిస్ట్ చూస్తే..

 మే నెల తొలి వీకెండ్ లో నెట్‌ఫ్లిక్స్ తన ఓటీటీ ప్లాట్‌ఫామ్ పై ఉన్న ట్రెండింగ్ మూవీస్ లిస్ట్ విడుదల చేసింది.  ట్రెండింగ్ మూవీస్ లో కిరణ్ రావ్ డైరెక్ట్ చేసిన లాపతా లేడీస్.. వెబ్ సిరీస్ లో సంజయ్ లీలా భన్సాలీ అత్యంత భారీ బడ్జెట్ సిరీస్ హీరామండి టాప్ లో ఉన్నాయి.
 
  ఏప్రిల్ 26న లాపతా లేడీస్ మూవీ నెట్‌ఫ్లిక్స్ లోకి అడుగు పెట్టింది. మరుసటి రోజు నుంచే ఇండియాలో ఈ మూవీ టాప్ ట్రెండింగ్ గా నిలిచింది. తొలి వారం మొత్తం అదే స్థానంలో కొనసాగుతోంది.

ఇక రెండో స్థానంలో టిల్లూ స్క్వేర్ మూవీ ఉంది. ఆ తర్వాత మూడు నుంచి పది స్థానాల్లో ఉన్న మూవీస్ చూస్తే వరుసగా.. ఆర్టికల్ 370, డియర్, అమర్ సింగ్ చమ్కీలా, దంగే, ఎనీవన్ బట్ యు, ఆల్ ఇండియా ర్యాంక్, ఫైటర్, సిటీ హంటర్ నిలిచాయి.

1. లాపతా లేడీస్

2. టిల్లూ స్క్వేర్

3. ఆర్టికల్ 370

4. డియర్

5. అమర్ సింగ్ చమ్కీలా

6. దంగే

7. ఎనీవన్ బట్ యు

8. ఆల్ ఇండియా ర్యాంక్

9. ఫైటర్

10. సిటీ హంటర్


నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్ వెబ్ సిరీస్
 

1. హీరామండి

2. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో

3. డెడ్ బాయ్ డిటెక్టివ్స్

4. బేబీ రీఇండీర్

5. క్వీన్ ఆఫ్ టియర్స్

6. మామ్లా లీగల్ హై

7. ది అసుంటా కేస్

8. మాంక్

9. ది లాస్ట్ ఎయిర్‌బెండర్

10. పారాసైట్ ద గ్రే

Follow Us:
Download App:
  • android
  • ios