దినసరి కూలీగా మారిన 'పద్మశ్రీ' కిన్నెర మొగిలయ్య.. వీడియో వైరల్

Kinnera Mogulaiah: పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ జానపద కళాకారుడు దర్శనం మొగులయ్య రోజువారి కూలీగా మారారు. హైదరాబాద్‌ సమీపంలోని  ఓ నిర్మాణ స్థలంలో పని చేస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియాలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అసలేం జరిగింది? ఆయన దినకూలీ గా ఎందుకు పనిచేస్తున్నారో తెలుసా? 

Padma Shri Award Winner Darshanam Mogulaiah Becomes Daily Wager In Hyderabad video viral KRJ

Kinnera Mogulaiah: ‘మెట్ల కిన్నెర’తో అత్యంత సాధారణంగా కనిపించే అరుదైన కళాకారుడు కిన్నెర మొగిలయ్య. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఆయన సుపరితంగా మారారు. ఆయన అద్భుత కళకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టం కట్టింది. కేంద్రం దృష్టిలో పడేలా చేసింది. దీంతో అతని అరుదైన ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పద్మ అవార్డుతో సత్కరించింది.

గతంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఆర్థికంగా అదుకుంది. అంతటీతో మొగలయ్య కష్టాల కథ సుఖాంతంగా మారిందని అందరూ భావించారు. కానీ ఆ ప్రతిష్టాత్మక పద్మశ్రీ కనీసం ఆయన పొట్ట కూడా నింపలేకపోక పోతుంది. దిక్కుతోచని పరిస్థితుల్లో పద్మ శ్రీ కిన్నెర మొగిలయ్య పూట గడవడం కోసం రోజు వారి కూలీగా మారాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ జానపద కళాకారుడు దర్శనం మొగులయ్య రోజువారి కూలిగా మారారు. హైదరాబాద్ సమీపంలోని తుర్కయమంజాల్‌లో ఓ నిర్మాణ స్థలంలో పని చేస్తూ కనిపించారు. ఈ సందర్భంగా మొగలయ్య మాట్లాడుతూ..'నా కుమారుల్లో ఒకరు మూర్ఛతో బాధపడుతున్నారు. అతని మందుల కోసం నెలకు కనీసం రూ. 7,000 కావాలి. సాధారణ వైద్య పరీక్షలు, ఇతర ఖర్చులు ఉన్నాయి. నా మీదనే ఆధారపడిన కుటుంబం ఉంది.  అందుకే కూలీ పనులకు వెళ్తున్న’నని చెప్పుకొచ్చారు మెుుగులయ్య. 

గత ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 10,000 నెలవారీ గౌరవ వేతనం ఇటీవల నిలిపివేశారని మెుగులయ్య ఆవేదన వ్యక్తం చేశారు.అలా ఎందుకు తనకు తెలియడం తెలియదనీ, తన పూటగడవటం కోసం .. ఎన్నో చోట్ల ప్రయత్నించినా..తనపై సానుభూతి, మర్యాద చూపిస్తున్నారనే తప్ప పని ఇవ్వలేదన్నారు.

తన ప్రతిభను గుర్తించి చిన్న మెుత్తంలో సాయం చేసినా.. దాని వల్ల ఉపాధి లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే.. గత ప్రభుత్వం తనకు కోటి రూపాయలు గ్రాంట్‌గా ఉచ్చిందనీ, కానీ, ఆ డబ్బును తన పిల్లల పెళ్లిళ్ల కోసం ఉపయోగించననీ, తుర్కయంజాల్‌లో కొంత భూమిని కొని, ఇంటి నిర్మాణం కూడా ప్రారంభించానని తెలిపారు. అయితే.. సరిపడా డబ్బులు లేకపోతే మధ్యలోనే ఆపేశానని తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios