కొన్నిరోజుల దేశాన్ని ఒక్కసారిగా షాక్ కి గురి చేసిన దిశ ఘటన గురించి అందరికి తెలిసిందే. సాధారణ జనం నుంచి సెలబ్రెటీల వరకు అందరిని కదిలించిన ఈ ఘటనలో నిందితులను పోలీసులు పారిపోతుండగా ఎన్ కౌంటర్ చేయడం మరొక షాకింగ్ న్యూస్. ఇక ఘటనపై భిన్నాభిప్రాయాలు వేస్తున్నప్పటికీ ఇంకా కేసు ఒక కొలిక్కి రావడం లేదు.

దిశ నిందితుల మృతదేహాలు 50 శాతం కుళ్లిపోయాయి: హైకోర్టుకు గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్

అసలు మ్యాటర్ లోకి వస్తే.. సమంత దిశ సంఘటన ఆధారంగా ఒక సినిమా కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఇప్పటికే పలు సినిమాల్లో సీన్లు తెరకెక్కుతున్నాయని టాక్ వచ్చింది. బాలకృష్ణ - బోయపాటి సినిమాల్లో కూడా దిశ ఘటనపై ఒక సీన్ ని చూపించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇక ఇప్పుడు తమిళ దర్శకుడు శరవణన్ ఘటన ఆధారంగా కథను అల్లుతున్నట్లు తెలుస్తోంది.  ముందే సమంతతో ఈ విషయంపై చర్చించిన దర్శకుడు గ్రీన్ సిగ్నల్ కూడా అందుకున్నాడట. వైవిధ్యమైన పాత్రల్లో నటించడానికి ముందుండే సమంత దిశ పాత్రలో నటించడానికి కూడా ఏ మాంత్రం సందేహం లేకుండా ఒప్పుకుందట.

అందుకు సంబందించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది, మరి ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సమంత 96 పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అలాగే మరో రెండు సినిమాలు చేస్తోంది