హైదరాబాద్:  దిశపై అత్యాచారం,హత్య చేసిన కేసులో ఎన్‌కౌంటర్‌కు గురైన నలుగురు నిందితుల మృతదేహాలు ఇప్పటికే 50 శాతం కుళ్లిపోయినట్టుగా గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్ శ్రవణ్ కుమార్  తెలంగాణ హైకోర్టుకు తెలిపారు.

దిశ నిందితుల మృతదేహాలు భద్రపర్చడంపై శనివారం నాడు ఉదయం తెలంగాణ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. శుక్రవారం నాడు కూడ హైకోర్టులో ఈ పిటిషన్ పై విచారణ చేసింది.నిన్నటి విచారణను ఇవాళ కూడ కొనసాగించింది.

Also read:దిశ నిందితులు: చెన్నకేశవులు భార్య కూడ మైనరే

గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్ శ్రవణ్ కుమార్ తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందు శనివారం నాడు హాజరయ్యారు. దిశ నిందితుల మృతదేహాల పరిస్థితిపై తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు.

Also read:‘టీ అమ్మనీకి పోయినా’’.. నేను ఉండుంటే దిశపై దారుణం జరిగేది కాదు

నిందితుల మృతదేహాలు ఇప్పటికే  50 శాతం కుళ్లిపోయినట్టుగా  గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో మైనస్ 2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉన్న ఫ్రీజర్‌లో నిందితుల మృతదేహాలను భద్రపర్చినట్టుగా సూపరింటెండ్ తెలిపారు.

Also Read:దిశ నిందితుల ఎన్‌కౌంటర్: మృతదేహాల అప్పగింతపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

మరో వారం పది రోజుల్లో నిందితుల మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోతాయని సూపరింటెండ్ శ్రవణ్ హైకోర్టుకు తెలిపారు.  దేశంలోని ఇతర ఆసుపత్రుల్లో మృతదేహాలను భద్రపర్చే అవకాశం ఉందా అని హైకోర్టు గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్‌ను ప్రశ్నించారు.అయితే ఈ విషయం తనకు తెలియదని   గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్ తేల్చి చెప్పారు.