తాగేసి సమంతపై వర్మ ట్వీట్ చేశాడా.. అవును నిజమే. కాకపోతే ఈ సంఘటన ఇప్పుడు జరిగింది కాదు. సమంత, చైతు కలసి చివరగా నటించిన మజిలీ చిత్ర టైంలో వర్మ ఆ ట్వీట్ చేశాడు.

తాగేసి సమంతపై వర్మ ట్వీట్ చేశాడా.. అవును నిజమే. కాకపోతే ఈ సంఘటన ఇప్పుడు జరిగింది కాదు. సమంత, చైతు కలసి చివరగా నటించిన మజిలీ చిత్ర టైంలో వర్మ ఆ ట్వీట్ చేశాడు. తాను మద్యం సేవించే ఈ ట్వీట్ చేస్తున్నట్లు కూడా వర్మ పేర్కొన్నాడు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

సమంత, చైతు కలసి నటించిన మజిలీ చిత్రం ఘనవిజయం సాధించింది. శివ నిర్వాణ దర్శకత్వంలో మజిలీ చిత్రం ఇంటెన్స్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. ఈ చిత్రం ట్రైలర్ విడుదలయ్యాక వర్మ ట్వీట్ చేశాడు. 

ట్రైలర్ లో చైతు, సమంత కెమిస్ట్రీకి అభిమానులు ప్రశంసిస్తూ పోస్ట్ లు పెట్టడం ప్రారంభించారు. వర్మని కూడా ఆ ట్రైలర్ ఆకర్షించింది. ప్రస్తుతం నేను నాల్గవ వోడ్కా లో ఉన్నా. మందు లేకుంటే నను వరస్ట్ గా ఉంటా. అందుకే మద్యం సేవిస్తూ ట్వీట్ చేస్తున్నా. నాకు ట్రయిలర్ లో సమంత కంటే చైతునే బాగా నచ్చాడు. కానీ నేను గే కాదు అని వర్మ ట్వీట్ చేశాడు. 

దీనికి చైతు కూడా తనదైన శైలిలో బదులిచ్చాడు. ఏదైతే ఏముంది వర్మ.. మీరు మాట్లాడమే మాకు అత్యంత ఆశ్చర్యం కలిగించే విషయం అని చైతు వర్మకు రిప్లై ఇచ్చాడు.