Asianet News TeluguAsianet News Telugu

'ప్రతిరోజూ పండగే' మూడు రోజుల కలెక్షన్స్ !

ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. వినోదంతో పాటు మంచి సందేశాన్ని మారుతి ఈ చిత్రం ద్వారా అందించారు. తొలి రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 4 కోట్ల వరకు షేర్ రాబట్టింది. 

prathiroju pandage movie three days collections
Author
Hyderabad, First Published Dec 23, 2019, 11:39 AM IST

మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన 'ప్రతిరోజూ పండగే' చిత్రం డిసెంబర్ 20న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మారుతి దర్శత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించగా సత్యరాజ్, రావు రమేష్ కీలక పాత్రల్లో నటించారు. 

ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. వినోదంతో పాటు మంచి సందేశాన్ని మారుతి ఈ చిత్రం ద్వారా అందించారు. తొలి రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 4 కోట్ల వరకు షేర్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ లభించాయి. 

ఆమె కలలు చాలా పెద్దవి.. రష్మికతో బ్రేకప్ పై రక్షిత్!

ఏపీ, తెలంగాణాలో తొలి రోజు ఈ సినిమా 3.13 కోట్ల షేర్ కొల్లగొట్టింది. అదే జోరు వీకెండ్ లో కూడా కంటిన్యూ చేసింది. మొత్తం మూడు రోజులకు గాను ఈ సినిమా రూ.8.63 కోట్ల థియేట్రికల్ షేర్ వసూలు చేసింది. అమెరికాలో ఈ సినిమా 200k డాలర్స్ ని రాబట్టింది.
 
ఏరియాల వారీగా మూడు రోజుల కలెక్షన్స్..

నైజాం.................................................................... రూ.3.70 కోట్లు

సీడెడ్.......................................................................రూ.1.09 కోట్లు 

నైజాం.....................................................................  రూ.3.70 కోట్లు

సీడెడ్......................................................................  రూ.1.09 కోట్లు

ఉత్తరాంధ్ర............................................................... రూ.1.04 కోట్లు

కృష్ణ......................................................................... రూ.0.62 కోట్లు

గుంటూరు..................................................................రూ.0.66 కోట్లు

నెల్లూరు...................................................................  రూ.0.34 కోట్లు

ఈస్ట్.........................................................................  రూ.0.69 ఈస్ట్

వెస్ట్.........................................................................   రూ.0.52 కోట్లు

మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులకు ఈ సినిమా సాధించిన షేర్ రూ.8.63 కోట్లు 

Follow Us:
Download App:
  • android
  • ios