కన్నడ బ్యూటీ రష్మిక టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారింది. 'ఛలో' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత 'గీత గోవిందం' చిత్రంతో భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతుంది.

ఇది ఇలా ఉండగా.. గతంలో ఈ బ్యూటీకి కన్నడ నటుడు రక్షిత్ తో నిశ్చితార్ధం జరిగింది. చాలా కాలం పాటు ప్రేమించుకున్న ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కావాలనుకున్నారు. ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. కానీ రష్మిక ఆ ఎంగేజ్మెంట్ ని బ్రేక్ చేసుకుంది. అప్పట్లో ఈ విషయంపై ఆమె క్లారిటీ కూడా ఇచ్చింది.

'అర్జున్ రెడ్డి' హీరోయిన్ పై క్రిమినల్ కేసు.. అసలేం జరిగిందంటే..?

అయినప్పటికీ ఆమె బ్రేకప్ పై వార్తలు ఆగలేదు. తాజాగా ఈ బ్రేకప్ గురించి రక్షిత్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ప్రస్తుతం రక్షిత్ నటించిన 'అతడే శ్రీమన్నారాయణ' సినిమా రిలీజ్ కి దగ్గరపడుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రక్షిత్ కి తన మాజీ ప్రేయసి రష్మికకి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.

దీనిపై ఆయన మాట్లాడుతూ.. 'ఆమె చాలా పెద్ద కలలు కనింది. ఆమె గతం నాకు తెలుసు కాబట్టి.. ఆ కలలు ఎక్కడ నుండి వచ్చాయో కూడా తెలుసు.. ఆమె కలలు నిజం కావాలని కోరుకుంటున్నాను' అంటూ చెప్పుకొచ్చారు. వీరిద్దరూ బ్రేకప్ విషయాన్ని బయట పెట్టినప్పుడు రక్షిత్ అభిమానులు రష్మికని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసేవారు.

ఆ సమయంలో రక్షిత్.. రష్మికని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. రష్మికని జడ్జి చేసి మాట్లాడకూడదని కోరారు. కాగా.. రక్షిత్ నటించిన 'అతడే శ్రీమన్నారాయణ' సినిమా కన్నడలో డిసెంబర్ 27న, తెలుగులో జనవరి 1న, తమిళ-మలయాళ భాషల్లో జనవరి 3న, హిందీలో జనవరి 16న విడుదల కానుంది.