నటి అనిత హస్సానందాని గుర్తుందిగా.. ఉదయ్ కిరణ్ సరసన నువ్వు నేను చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయింది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో అనితకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. తన వద్దకు వచ్చిన ప్రతి ఛాన్స్ ని అనిత సద్వినియోగం చేసుకుంది. 

శ్రీరామ్, తొట్టి గ్యాంగ్ లాంటి చిత్రాల్లో కూడా అనిత నటించింది. ప్రస్తుతం అనిత వయసు 39 ఏళ్ళు. అయినా కూడా కుర్ర భామ తరహాలో అనిత గ్లామర్ గా కనిపిస్తోంది. 2013లో అనిత రోహిత్ రెడ్డి అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరిద్దరి అన్యోన్యత గురించి మాటల్లో వర్ణించలేం. భర్తతో రొమాన్స్ చేస్తున్న వీడియోల్ని సైతం అనిత సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటోంది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

When going out was a thing! @rohitreddygoa cute 🍑😂🤣😂

A post shared by Anita H Reddy (@anitahassanandani) on May 16, 2020 at 10:49pm PDT

వీరిద్దరూ వెకేషన్స్ , పార్టీలు, పబ్బుల్లో ఎంజాయ్ చేసే జంట. ఆ మధ్యన తన భర్తతో కలసి పబ్బులో గడిపిన వీడియోను అనిత షేర్ చేసింది. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది. పబ్బులో అనిత భర్త రోహిత్ రెడ్డి డాన్స్ చేస్తున్నాడు. అనిత వెనుక నుంచి వచ్చి భుజం తట్టినా పట్టించుకోలేదు. అనిత మరోసారి ప్రయత్నించింది అయినా పట్టించుకోలేదు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

MINE 🍕

A post shared by Anita H Reddy (@anitahassanandani) on May 4, 2020 at 7:40am PDT

దీనితో అనిత అతడి పిరుదులపై ఒక్కటి ఇచ్చింది. ఆ తర్వాత అతడు వెనక్కి తిరిగి చూశాడు. ఈ దృశ్యం నెటిజన్లని బాగా ఆకట్టుకుంటోంది. రొమాంటిక్ గా చేసిన మరో టిక్ టాక్ వీడియో కూడా అలరిస్తోంది. ఈ వీడియోలో అనిత తన భర్తకు లిప్ కిస్ పెట్టేసింది.