యాంకర్ అనసూయకి టాలీవుడ్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.  బుల్లితెరపై పలు కార్యక్రమాలకు అనసూయ యాంకరింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ తో పాటు మహిళలకు నచ్చే అనేక కార్యక్రమాలకు అనసూయ యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఇక అనసూయని సోషల్ మీడియాలో కూడా లక్షలాదిమంది అభిమానులు ఫాలో అవుతారు. 

అనసూయ ఏం చేసిన సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. కాస్త హాట్ గా ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసిందంటే నెటిజన్లు పండగ చేసుకుంటారు. కానీ మరొకొందరు మాత్రం అనసూయని టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తారు. తాజాగా మరోసారి అనసూయ ట్రోలింగ్ కు గురైంది. 

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సెలెబ్రిటీలంతా సోషల్ మీడియా వేదికగా యోగాసనాలు చేస్తున్న వీడియోలు, ఇంటిపనులు వంట పనులు చేస్తున్న వీడియోల్ని అభిమానులతో పంచుకుంటున్నారు. 

అనసూయ కూడా తన ఇంట్లో కిచెన్ లో వైరైటీ ఐటమ్స్ ట్రై చేస్తూ అభిమానులకు ఆ వంటకాలు ఎలా వండాలో చెబుతోంది. అనసూయ ఈ వీడియోల్లో పొట్టి దుస్తులతో కనిపిస్తోంది. అదే విధంగా డాన్స్ కూడా చేసింది. దీనితో కొందరు ఆకతాయిలు తమ నోటికి పని చెప్పారు. 

అనసూయ ఇలాంటి వీడియోలు పోస్ట్ చేసే బదులు పోర్న్ ఇండస్ట్రీకి వెళ్ళొచ్చుగా అంటూ బూతులతో రెచ్చిపోయారు. నాలుగుగోడల మధ్య మాత్రమే ఉండాల్సిన దృశ్యాలని సోషల్ మీడియాలోకి తీసుకురావడం.. వాటిపై కామెంట్ చేస్తే.. నెటిజన్లపై పడి ఏడవడం అలవాటుగా మారిపోయింది అంటూ నెటిజనులు అనసూయ వీడియోలపై కామెంట్స్ చేస్తున్నారు.