Asianet News TeluguAsianet News Telugu

'అల వైకుంఠపురములో' మరో సాంగ్ వచ్చేసింది!

ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన మూడు పాటలకు సినీ అభిమానుల నుండి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి నాలుగో టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం.

Ala Vaikunthapurramuloo Telugu Movie Buttabomma Song Teaser Out
Author
Hyderabad, First Published Dec 22, 2019, 12:52 PM IST

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కలిసి మూడో సారి చేస్తున్న సినిమా 'అల వైకుంఠపురములో'. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన మూడు పాటలకు సినీ అభిమానుల నుండి మంచి స్పందన వచ్చింది.

తాజాగా ఈ సినిమాకి సంబంధించి నాలుగో టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. 'బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను సుట్టూకుంటివే జిందగికే అట్టబొమ్మై జంటకట్టూకుంటివే' అంటూ సాగే మెలోడీ సాంగ్ టీజర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఈ పాటకి  రామజోగయ్యశాస్త్రి లిరిక్స్‌ అందించగా.. అర్మాన్‌ మాలిక్‌ ఆలపించాడు.

అల్లు అర్జున్ మూవీ.. ఒక పని పూర్తి చేసిన సుకుమార్!

ప్రస్తుతం ఈ సాంగ్‌ టీజర్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఇక ‘బుట్టబొమ్మ’పూర్తి సాంగ్‌ను ఈ నెల24 విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రంలో టబు, నివేదా పేతురాజ్, రాజేంద్ర ప్రసాద్, జయరామ్, సుశాంత్, వెన్నెల కిశోర్, సునీల్, బ్రహ్మాజీ, మురళీ శర్మ, హర్ష వర్ధన్, సచిన్ ఖెడేకర్ కీలక పాత్రలు పోషించారు.

హారిక అండ్ హాసిని ప్రొడక్షన్స్ మరియు గీతా ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మితమవుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాని విడుదల చేయనున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios