స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అల వైకుంఠపురములో' చిత్రాన్ని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. 

ఇప్పటికే విడుదల చేసిన సామజవరగమన, రాములో రాములా సాంగ్స్ యూట్యూబ్ లో 100 మిలియన్ల వ్యూస్ తో రికార్డ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బన్నీకి జోడిగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అల వైకుంఠపురములో చిత్రం తర్వాత బన్నీ మరో భారీ ప్రాజెక్ట్ పై కన్నేశాడు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శత్వంలో బన్నీ తదుపరి చిత్రం ఉండబోతోంది. 

ఇటీవలే ఈ చిత్రాన్ని లాంచ్ చేశారు. తొలిసారి రష్మిక మందన బన్నీతో రొమాన్స్ చేయబోతున్న మూవీ ఇది. రంగస్థలం చిత్రంలో 1980 కాలం నాటి విలేజ్ పాలిటిక్స్ చూపించిన సుక్కు.. బన్నీ 20వ చిత్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియాని టార్గెట్ చేశాడు. 

కథ పరంగా ఈ చిత్రంలోని ఎక్కువ సన్నివేశాలు నల్లమల ఫారెస్ట్ లో చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం సుకుమార్ ప్రత్యేకంగా కొందరు ఆర్టిస్టులని ఎంపిక చేసుకున్నారు. వారందరిని కేరళ తీసుకుని వెళ్లి టెస్ట్ షూట్ నిర్వహించారట. విభిన్నమైన కథ, ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం కావడంతో షూటింగ్ ప్రారంభించడానికి ముందే సుక్కు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 

ఉత్తమ నటుడు రాంచరణ్.. ఫిలిం ఫేర్ లో 'రంగస్థలం'కే ఐదు!

ఈ చిత్రంలో అల్లు అర్జున్ రఫ్ లుక్ లో కనిపించబోతున్నట్లు వినికిడి. మొదటి షెడ్యూల్ కోసం సుకుమార్, అల్లు అర్జున్, రష్మిక బ్యాంకాక్ వెళ్లనున్నారు. అక్కడ కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన తర్వాత ఇండియాకు తిరిగి వస్తారు. ఈ చిత్రంలోని డైలాగ్స్ లో చిత్తూరు స్లాంగ్ ఉండబోతోంది.