Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్: స్టార్ హీరో రెమ్యునరేషన్ రూ.120 కోట్లు.. సూపర్ స్టార్లు ఎందరుంటే ఏంటి!

సూపర్ స్టార్లు ఎందరుంటే ఏంటి.. మినిమమ్ గ్యారెంటీ హీరోకి ఉండే డిమాండే వేరు. ఇది అక్షరాలా సత్యం అని నిరూపిస్తున్నాడు ఖిలాడీ హీరో అక్షయ్ కుమార్. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ ని మించిన స్టార్ హీరోలు ఎందరో ఉన్నారు. కానీ వారెవరూ అక్షయ్ కుమార్ సంపాదనతో ఏమాత్రం పోటీ పడలేకున్నారు.

Akshay Kumar will reportedly take home a paycheck of Rs 120 crore for his next film
Author
Hyderabad, First Published Jan 22, 2020, 5:24 PM IST

సూపర్ స్టార్లు ఎందరుంటే ఏంటి.. మినిమమ్ గ్యారెంటీ హీరోకి ఉండే డిమాండే వేరు. ఇది అక్షరాలా సత్యం అని నిరూపిస్తున్నాడు ఖిలాడీ హీరో అక్షయ్ కుమార్. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ ని మించిన స్టార్ హీరోలు ఎందరో ఉన్నారు. కానీ వారెవరూ అక్షయ్ కుమార్ సంపాదనతో ఏమాత్రం పోటీ పడలేకున్నారు. దీనికి కారణం అక్షయ్ కుమార్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న విజయాలే. 

అక్షయ్ కుమార్ సినిమా విడుదలైందంటే చాలు.. అది ఏ జోనర్ అయినా 150 కోట్ల కలెక్షన్స్ పక్కా. ఒక ఏడాదిలో అక్షయ్ కుమార్ అత్యధిక చిత్రాల్లో నటిస్తున్నాడు. అక్షయ్ కుమార్ కు ఉన్న డిమాండ్ దృష్ట్యా తాజాగా ఓ భారీ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. 

అక్షయ్ కుమార్ త్వరలో తను వెడ్స్ మను, జీరో చిత్రాల దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో హీరో ధనుష్, సారా అలీ ఖాన్ కూడా కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రానికి గాను అక్షయ్ కుమార్ రూ. 120 కోట్ల కళ్ళు చెదిరే పారితోషికం అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. 

స్టార్ హీరోకి అదిరిపోయే కౌంటర్.. 'మహాభారతం' ఏమిటని ప్రశ్నించిన కంగన!

ఈ డీల్ తో అక్షయ్ కుమార్ బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోగా అవతరించబోతున్నాడు. ప్రస్తుతం ఈ విషయం బిటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. 2019లో అక్షయ్ కుమార్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద 700 కోట్ల బిజినెస్ చేశాయి. 2020లో కూడా అక్షయ్ కుమార్ వరుస చిత్రాల్లో నటిస్తున్నాడు. 

'ప్రతిరోజూ పండగే' క్లోజింగ్ కలెక్షన్స్.. లాభాల పండగ!

సూర్యవంశీ, పృథ్విరాజ్, లక్ష్మీబాంబ్ లాంటి చిత్రాల్లో అక్షయ్ నటిస్తున్నాడు. గత ఏడాది అక్షయ్ కుమార్ నటించిన కేసరి చిత్రం 154 కోట్లు, మిషన్ మంగళ్ చిత్రం 202 కోట్లు, హౌస్ ఫుల్ 4 మూవీ 194 కోట్ల వసూళ్లు సాధించాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios