సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ మళ్ళీ మునుపటి జోరుని అందిపుచ్చుకున్నాడు. డబుల్ హ్యాట్రిక్ పరాజయాలతో డీలా పడ్డ సాయిధరమ్ తేజ్ కెరీర్ కు చిత్రలహరి, ప్రతిరోజూ పండగే బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ మంచి బూస్టప్ అందించాయి. ముఖ్యంగా ప్రతిరోజూ పండగే చిత్రం క్రిస్టమస్ సెలవులకి ఉపయోగించుకుని కలెక్షన్ల వర్షం కురిపించింది. 

మహేష్ తో స్పెషల్ సాంగ్.. ఇండస్ట్రీలో కొన్ని తప్పవు.. తమన్నా కామెంట్స్

ఫలితంగా ప్రతిరోజూ పండగే చిత్రం సాయిధరమ్ తేజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మారుతి దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాయిధరమ్ తేజ్, రాశి ఖన్నా ఈ చిత్రంలో జంటగా నటించారు. దర్శకుడు మారుతి వినోదాత్మకంగా మలచిన ఈ ఫ్యామిలీ డ్రామాకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా తేజు పెర్ఫామెన్స్, రాశి ఖన్నా గ్లామర్, రావు రమేష్ నటన ఈ చిత్రాన్ని మరోస్థాయికి చేర్చాయి. 

స్టార్ హీరోకి అదిరిపోయే కౌంటర్.. 'మహాభారతం' ఏమిటని ప్రశ్నించిన కంగన!

తాజా సమాచారం మేరకు ప్రతిరోజూ పండగే చిత్ర రన్ బాక్సాఫీస్ వద్ద ముగిసింది. క్లోజింగ్ కలెక్షన్స్ వివరాలు బయటకు వచ్చాయి. ఫుల్ రన్ లో ప్రతిరోజూ పండగే చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 36 కోట్ల షేర్ సాధించింది. ఈ చిత్రానికి జరిగిన ప్రీరిలీజ్ బిజినెస్ 18 కోట్లు. అంటే అన్ని ప్రాంతాల్లో బయ్యర్లు డబుల్ ప్రాఫిట్స్ సొంతం చేసుకున్నారు. 

మళ్ళీ లవ్ ఎఫైర్.. విడాకుల తర్వాత శ్వేతా బసు!

గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియోషన్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మించారు. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.