బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఎలాంటి విషయం గురించి అయినా కంగనా రనౌత్ బెదురూ లేకుండా మాట్లాడేస్తుంది. తానాజీ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సైఫ్ అలీఖాన్ ఇండియా గురించి చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. 

తానాజీ చిత్రంతో తాను అద్భుతమైన పాత్ర పోషించానని సైఫ్ తెలిపాడు. ప్రతి ఒక్కరు ఈ చిత్రాన్ని ఇండియన్ హిస్టరీ అని అంటున్నారు. కానీ నా అభిప్రాయం వేరుగా ఉంది. బ్రిటిష్ వారు వచ్చే వరకు 'ఇండియా' అనే కాన్సెప్ట్ లేదు అని సైఫ్ కామెంట్స్ చేశాడు. 

బ్రిటిష్ వారు ఇండియాలో అడుగుపెట్టేవరకు భారత దేశం ముక్కలు ముక్కలుగా, వివిధ సామ్రాజ్యాలుగా ఉండేది. ఐక్య భారత దేశం లేదనే కోణంలో సైఫ్ తన అభిప్రాయాన్ని తెలిపాడు. సైఫ్ కామెంట్స్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. నెటిజన్లంతా సైఫ్ ని ట్రోల్ చేయడం ప్రారంభించారు. 

మహేష్ తో స్పెషల్ సాంగ్.. ఇండస్ట్రీలో కొన్ని తప్పవు.. తమన్నా కామెంట్స్

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా రనౌత్ సైఫ్ అలీ ఖాన్ కామెంట్స్ పై స్పందించింది. బ్రిటిష్ వారు రాకమునుపు భారత దేశం అనే భావనే లేకుంటే.. మహాభారతం ఏమిటని కంగన ప్రశ్నించింది. 5000 ఏళ్ల క్రితమే వేదవ్యాసుడు రాసిన మహాభారతం ఏమని చెబుతోంది.. అది భారత దేశం గురించి కాదా అని కంగనా ప్రశ్నించింది. 

శ్రీకృష్ణుడు కీలక పాత్రధారిగా.. పాండవులు, కౌరవులు మధ్య జరిగిన మహాభారతం మన దేశం గురించి కదా అని కంగనా ప్రశ్నించింది. సైఫ్ అలీ ఖాన్ కామెంట్స్ ని ఖండించింది. కంగనా కామెంట్స్ ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.