Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ ఫ్యాన్స్ కు నిరాశ.. సంచలన సిరీస్ లో అదిరిపోయే అప్డేట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధా కృష్ణ దర్శత్వంలో జాన్(వర్కింగ్ టైటిల్)లో నటిస్తున్నాడు. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ ఆకాశాన్ని తాకింది.

Akshay Kumar to collaborate with Yash Raj Films for Dhoom 4
Author
Hyderabad, First Published Feb 4, 2020, 3:38 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధా కృష్ణ దర్శత్వంలో జాన్(వర్కింగ్ టైటిల్)లో నటిస్తున్నాడు. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ ఆకాశాన్ని తాకింది. ప్రస్తుతం ప్రభాస్ బాలీవుడ్ హీరోలకు కూడా ధీటైన స్టార్. 

ప్రభాస్ నటించే చిత్రాలకు హిందీ మార్కెట్ లో వందల కోట్ల బిజినెస్ జరుగుతోంది. ఇలా ప్రభాస్ ఎలాగు ఆరడుగుల కటౌట్. ప్రభాస్ తో సినిమా చేయడానికి చాలా మంది బాలీవుడ్ దర్శకులు ఆసక్తి చూపుతున్నారు. ధూమ్ సిరీస్ కు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఇప్పటి వరకు ఈ ప్రాంఛైజీలో వచ్చిన మూడు చిత్రాలు ఘనవిజయం సాధించాయి. 

ధూమ్ 4లో ప్రధాన పాత్ర కోసం ప్రభాస్ తో బాలీవుడ్ మేకర్స్ సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆ మధ్యన వార్తలు వచ్చాయి. ధూమ్ లో అభిషేక్, జాన్ అబ్రహం ప్రధాన పాత్రల్లో నటించారు. ధూమ్ 2లో హృతిక్ రోషన్, ధూమ్ 3లో అమీర్ ఖాన్ నటించారు. ప్రస్తుతం అభిమానులంతా ధూమ్ 4కి సంబంధించిన ప్రకటన కోసం ఎదురుచూస్తున్న తరుణంలో అదిరిపోయే అప్డేట్ వచ్చింది. 

చాణక్యుడు, తెనాలి రామకృష్ణుడు.. పవన్ కళ్యాణ్ పాత్రలో ఆ ఇద్దరు

ధూమ్ 4లో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించబోతున్నట్లు బాలీవుడ్ ప్రముఖ క్రిటిక్ అతుల్ మోహన్ ప్రకటించారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందని అన్నారు. ఈ వార్త ప్రభాస్ అభిమానులకు కాస్త నిరాశకలిగించేదే. ప్రభాస్ ని ధూమ్ సిరీస్ లో యాక్షన్ హీరోగా చూడాలనుకున్న ఫ్యాన్స్ ఈ వార్తతో నిరాశ చెందుతారు. 

ఖిలాడీ హీరో అక్షయ్ కుమార్ ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్, ఆదిత్య చోప్రా మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ధూమ్ 4 కోసం గతంలో రణవీర్ సింగ్, సల్మాన్ ఖాన్ పేర్లు కూడా వినిపించాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios