జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. సినిమాలు చేస్తూనే రాజకీయాలు కూడా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పవన్ పింక్ రీమేక్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పింక్ రీమేక్ తర్వాత కూడా పవన్ కొందరు క్రేజీ డైరెక్టర్స్ తో సినిమాలు చేయబోతున్నారు. 

ఇటీవల క్రిష్ దర్శత్వంలో పవన్ కళ్యాణ్ ఓ చిత్రాన్ని ప్రారంభించారు. స్వాతంత్య్రానికి పూర్వం మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో దర్శకుడు ఓ పవర్ ఫుల్ స్టోరీ సిద్ధం చేసుకున్నారు. ఈ కథలో పవన్ బందిపోటు దొంగగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. 

పవన్ కళ్యాణ్ పాత్రకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కథలో దేశభక్తికి సంబంధించిన అంశాలు ఉండవట. క్రిష్ ఈ చిత్రాన్ని పుర్తిస్థాయిలో కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందించేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. సామాన్యులకు అండగా నిలబడే బందిపోటుగా పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నాడు. 

పవన్ పాత్రలో హిస్టారికల్ క్యారెక్టర్స్ తెనాలి రామకృష్ణుడు, చాణక్యుడి తరహా లక్షణాలు ఉంటాయట. భారీ బడ్జెట్ చిత్రం అయినప్పటికీ కథ బాగా నచ్చడంతో క్రిష్ కి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

పవన్ కళ్యాణ్ 'లాయర్ సాబ్'.. షాకిచ్చిన దిల్ రాజు!

పీరియాడిక్ చిత్రమే అయినప్పటికీ ప్రస్తుతం సమాజంలో నెలకొన్న పరిస్థితులని ప్రతిభింబించేలా క్రిష్ కొన్ని సన్నివేశాల రాసుకున్నారట. ప్రస్తుతం క్రిష్ పవన్ కళ్యాణ్ సరసన నటించే హీరోయిన్లని ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నారు. సాయిమాధవ్ బుర్రా ఈ చిత్రానికి మాటలు అందిస్తున్నారు. కీరవాణి సంగీత దర్శకుడు. ఏఎం రత్నం నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.