కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కీలకమైన ఆధారాలను సేకరించినట్టుగా కడప ఎస్పీ రాహుల్ ప్రకటించారు.

గురువారం నాడు అర్ధరాత్రి వైఎస్ వివేకానందరెడ్డి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు.శుక్రవారం నాడు వైఎస్ వివేకానందరెడ్డి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఈ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో  హత్యగా  వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు.

సంఘటన స్థలంలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు.  ఈ తనిఖీలు నిర్వహించిన సమయంలో కీలకమైన ఆధారాలను సేకరించినట్టుగా ఎస్పీ రాహుల్ ప్రకటించారు. వైఎస్ వివేకానందరెడ్డి తలపై, చేతిపై రెండు చోట్ల గాయాలున్నట్టుగా గుర్తించామన్నారు.

ఫింగర్ ఫ్రింట్స్‌  కూడ సేకరించామని  ఎస్పీ వివరించారు. రాత్రి పదకొండున్నర గంటల నుండి  ఉదయం ఐదు గంటలలోపు ఏం జరిగిందనే  విషయమై ఆరా తీస్తున్నామని ఎస్పీ వివరించారు.

ఈ ఆధారాల మేరకు విచారణ చేస్తున్నట్టుగా ఆయన తెలిపారు.వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన విషయమై శాస్త్రీయమైన ఆధారాలను సేకరించేందుకు గాను కడప, కర్నూల్ నుండి ఫోరెన్సిక్ బృందాలను రప్పిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వైఎస్ వివేకాది హత్యే: పోస్ట్‌మార్టం రిపోర్ట్ సంచలనం

వైఎస్ వివేకానందరెడ్డి మృతదేహనికి పోస్ట్‌మార్టం పూర్తి

బాబు, లోకేష్, ఆదిల హస్తం: వైఎస్ వివేకా మృతిపై రవీంద్రనాథ్ రెడ్డి

మమ్మల్ని కాల్చి చంపండి: వైఎస్ వివేకా మృతిపై టీడీపీ నేత సతీష్ రెడ్డి సంచలనం

వైఎస్ వివేకానందరెడ్డి మృతి: సిట్ ఏర్పాటు చేసిన సర్కార్

ఎన్నికలను ఎదుర్కోలేకే వివేక మరణంపై రాజకీయం: ఆదినారాయణరెడ్డి

తల, చేతిపై గాయాలు: వైఎస్ వివేకా మరణం వెనుక కుట్ర కోణం..?

నాడు జగన్‌తో విభేదాలు: విజయమ్మపై వైఎస్ వివేకా పోటీ

వివేకా బాత్‌రూం, బెడ్‌రూంలో రక్తపు మరకలు: కడప ఎస్పీ

వివేకానందరెడ్డి మరణంపై లోతైన దర్యాప్తు జరపాలి: విజయసాయి

వైఎస్ వివేకా మృతి.. లోకేష్ సంతాపం

నిన్న ప్రచారంలో వైఎస్ వివేకా: ఇంతలోనే ఇలా...

వైఎస్ వివేకానందరెడ్డి రాజకీయ ప్రస్థానం