కడప ఎంపీ స్థానానికి తనను బలవంతంగా పంపినట్లు ప్రచారం చేస్తున్నారన్నారు మంత్రి ఆదినారాయణ రెడ్డి. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్, కేటీఆర్ కంట్రోల్‌లో జగన్ పనిచేస్తున్నారని ఆది ఆరోపించారు.

ప్రభుత్వం పడిపోతుందని జగన్ తరచుగా చెబుతూనే ఉన్నారని ఆదినారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు. జగన్ సీఎం అయితే విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్స్‌లో ఉన్న ఆస్తుల విభజన అడగరన్నారు.

చంద్రబాబు, లోకేశ్, నేను, సతీశ్ రెడ్డి కుట్ర పన్ని వివేకానందరెడ్డిని ఏదో చేశామని ప్రచారం చేస్తున్నారని మంత్రి విమర్శించారు. థర్డ్ పార్టీ విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

గతంలో జగన్‌పై కోడికత్తి దాడి జరిగినప్పుడు తనపై ఆరోపణలు చేశారని ఆదినారాయణ రెడ్డి గుర్తు చేశారు. ఎప్పుడూ తప్పుడు ఆరోపణలు చేయడం జగన్‌కు అలవాటైపోయిందని ఆయన ఎద్దేవా చేశారు.

తప్పులను పక్కవారిపై నెట్టడం దుర్మార్గమన్నారు. ఎన్నికల్లో సమర్థంగా, నిజాయితీగా ఎదుర్కోలేక తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆది మండిపడ్డారు. జమ్ములమడుగులో జరిగిన అభివృద్ధిలో 1 శాతం పులివెందులలో జరగలేదన్నారు.

1999, 2004లో వివేకా పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తానన్నప్పుడు వైఎస్ కుటుంబంతో వివాదం జరిగిందని మంత్రి తెలిపారు. 2009లో రాజశేఖర్ రెడ్డి... వివేకానందరెడ్డిని ఎమ్మెల్సీని చేసి జగన్‌కు కడప ఎంపీ టికెట్ ఇచ్చారని మంత్రి గుర్తు చేశారు. 

వైఎస్ వివేకానందరెడ్డి మృతి: సిట్ ఏర్పాటు చేసిన సర్కార్

ఎన్నికలను ఎదుర్కోలేకే వివేక మరణంపై రాజకీయం: ఆదినారాయణరెడ్డి

తల, చేతిపై గాయాలు: వైఎస్ వివేకా మరణం వెనుక కుట్ర కోణం..?

నాడు జగన్‌తో విభేదాలు: విజయమ్మపై వైఎస్ వివేకా పోటీ

వివేకా బాత్‌రూం, బెడ్‌రూంలో రక్తపు మరకలు: కడప ఎస్పీ

వివేకానందరెడ్డి మరణంపై లోతైన దర్యాప్తు జరపాలి: విజయసాయి

వైఎస్ వివేకా మృతి.. లోకేష్ సంతాపం

నిన్న ప్రచారంలో వైఎస్ వివేకా: ఇంతలోనే ఇలా...

వైఎస్ వివేకానందరెడ్డి రాజకీయ ప్రస్థానం