కడప: వైఎస్ వివేకానంద రెడ్డి మరణంపై వైసీపీ నేతలు తమపై ఆరోపణలను చేయడాన్ని టీడీపీ నేత సతీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. వైఎస్ వివేకానంద రెడ్డి మరణానికి  సంబంధించిన విషయంలో తమ ప్రమేయం ఉన్నట్టుగా తేలితే పులివెందుల రోడ్డులో కాల్చి చంపాలని ఆయన డిమాండ్ చేశారు.

శుక్రవారం నాడు ఆయన ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌తో ఆయన మాట్లాడారు. వైఎస్ వివేకానందరెడ్డి మృతి విషయం తనకు తమ పార్టీకి చెందిన నేత రాంగోపాల్ రెడ్డి సమాచారం ఇచ్చారని చెప్పారు. గుండెపోటు వల్ల వైఎస్ వివేకానందరెడ్డి చనిపోయారని చెప్పారని ఆయన గుర్తు చేసుకొన్నారు.

అయితే వైఎస్ వివేకానంద రెడ్డి మృతికి సంతాపం తెలిపేందుకు వెళ్లే విషయమై తమ పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన చెప్పారు. అయితే ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో వైసీపీకి చెందిన ఓ నేత వైఎస్ వివేకానందరెడ్డి మృతి విషయమై తమ  మీద అనుమానాలు వ్యక్తం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

గతంలో కూడ తనపై హత్యాయత్నం జరిగితే తనను కాపాడేందుకు గన్‌మెన్లు గాల్లోకి కాల్పులు జరిపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అంతేకాదు ఆ సమయంలో తాను దాడికి పాల్పడినట్టుగా కేసులు నమోదు చేసి జైలుకు పంపారన్నారు.

ఇంత నీచమైన రాజకీయాలు చేయడం తమకు  సాధ్యం కాదన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని  ఆయన డిమాండ్ చేశారు. వివేకానందరెడ్డి మృతికి తాము కారణమని తేలితే పులివెందుల రోడ్డులో కాల్చి చంపాలని సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

వైఎస్ వివేకానందరెడ్డి మృతి: సిట్ ఏర్పాటు చేసిన సర్కార్

ఎన్నికలను ఎదుర్కోలేకే వివేక మరణంపై రాజకీయం: ఆదినారాయణరెడ్డి

తల, చేతిపై గాయాలు: వైఎస్ వివేకా మరణం వెనుక కుట్ర కోణం..?

నాడు జగన్‌తో విభేదాలు: విజయమ్మపై వైఎస్ వివేకా పోటీ

వివేకా బాత్‌రూం, బెడ్‌రూంలో రక్తపు మరకలు: కడప ఎస్పీ

వివేకానందరెడ్డి మరణంపై లోతైన దర్యాప్తు జరపాలి: విజయసాయి

వైఎస్ వివేకా మృతి.. లోకేష్ సంతాపం

నిన్న ప్రచారంలో వైఎస్ వివేకా: ఇంతలోనే ఇలా...

వైఎస్ వివేకానందరెడ్డి రాజకీయ ప్రస్థానం